Chandrababu Naidu: వైసీపీకి వచ్చేవి 35 సీట్లే.. ఏపీలో వచ్చేది టీడీపీ ప్రభుత్వమే

Chandrababu Naidu Full Confidence On Winning In Elections: ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఎన్నికల్లో తమదే విజయమని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేశారు. విదేశీ పర్యటన నుంచి వచ్చిన ఆయన పార్టీ నాయకులతో ఈ విషయం చెప్పారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : May 29, 2024, 10:45 PM IST
Chandrababu Naidu: వైసీపీకి వచ్చేవి 35 సీట్లే.. ఏపీలో వచ్చేది టీడీపీ ప్రభుత్వమే

AP Election Results: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర భవిష్యత్‌కు కీలకమైన ఎన్నికల ఫలితాలు వచ్చే నెల 4వ తేదీన విడుదల కానున్నాయి. ఫలితాలకు సమయం సమీపించడంతో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు విదేశాల నుంచి హైదరాబాద్‌కు చేరుకున్నారు. విదేశీ యాత్ర దిగ్విజయంగా పూర్తి చేసుకున్న ఆయనను అభినందించేందుకు పార్టీ నాయకులు ఆయన నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులతో సమావేశమైన చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో విజయంపై పూర్తి విశ్వాసం వ్యక్తం చేశారు. ఏపీలో మనమే ప్రభుత్వం ఏర్పాటుచేయబోతున్నామని పార్టీ నాయకులతో చెప్పినట్లు సమాచారం. ఈ సందర్భంగా ఎన్నికల్లో కష్టపడి పనిచేసిన పార్టీ నాయకులను బాబు అభినందించినట్లు తెలిసింది.

Also Read: AP Election Results: ముంచుకొస్తున్న ఫలితాల సమయం.. జగన్‌, చంద్రబాబు, పవన్‌ ఏపీకి చేరుకునేదెప్పుడంటే..?

ఎన్నికల పోలింగ్‌ సరళి, అనంతరం జరిగిన పరిణామాలపై గంటన్నరపాటు సమావేశమైనట్లు సమాచారం. ఈ సందర్భంగా పార్టీ నాయకులతో బాబు కీలక వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో బాగా పని చేశామని పార్టీ నాయకులతో చెప్పారు. పార్టీ శ్రేణులు బాగా కష్టపడ్డారని కొనియాడారు. జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ ఒకే మాటకు కట్టుబడి ఉండి పూర్తి సహకారం అందించారని పేర్కొన్నట్లు తెలుస్తోంది. 'జనసేన, బీజేపీతో పొత్తు కలిసివచ్చింది. పార్టీపై విష ప్రచారం చేశారు. కానీ ప్రజలు వాటిని నమ్మలేదు' అని పేర్కొన్నట్లు సమాచారం. ఈ సందర్భంగా ఎన్నికల అనంతరం జరిగిన పరిణామాలపై పార్టీ నాయకులతో చర్చించారు.

Also Read: Diamonds Found: ఏపీలో వజ్రాల పంట పండుతోంది.. 3 రోజుల్లో కోట్ల విలువైన వజ్రాలు లభ్యం

మాచర్ల, తాడిపత్రిలో జరిగిన హింస రాష్ట్రమంతా చేయాలని చూసినట్లు చంద్రబాబు పార్టీ నాయకులతో చెప్పారు. కానీ వైఎస్సార్‌ సీపీ కుట్రలను ఎప్పటికప్పుడు దీటుగా ఎదుర్కొన్నట్లు గుర్తుచేసి ప్రశంసించారు. ఎన్నికల ఫలితాల రోజు కూడా ఆ పార్టీ విధ్వంసం, హింసలు, అల్లర్లు సృష్టించే ప్రమాదం ఉందని హెచ్చరించారు. కౌంటింగ్‌ రోజు ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని పార్టీ నాయకులకు సూచించారు. పోలింగ్‌ సరళి చూస్తే వైఎస్సార్‌సీపీకి 35 సీట్లు కూడా వచ్చేటట్లు రావని చంద్రబాబు వ్యాఖ్యానించినట్లు సమాచారం.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News