Chandrababu Case: ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టయి రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్న చంద్రబాబుకు సంబంధించిన పలు కేసులు, పిటీషన్లపై వచ్చేవారానికి గానీ స్పష్టత వచ్చే పరిస్థితి లేదు. ఏసీబీ, హైకోర్టు, సుప్రీంకోర్టు మూడింట్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
తెలుగు దేశం అధినేత చంద్రబాబు నాయుడు చుట్టూ ఇన్నర్ రింగ్ రోడ్ కేసు ఉచ్చు బిగుస్తున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో ముందస్తు బెయిల్‌కు చంద్రబాబు దాఖలు చేసిన పిటీషన్‌పై విచారణను ఏపీ హైకోర్టు 29వ తేదీకు వాయిదా వేసింది. అదే సమయంలో సీఐడీ కోరిన కస్టడీ పొడిగింపు పిటీషన్, చంద్రబాబు బెయిల్ పిటీషన్లపై ఏసీబీ కోర్టు అక్టోబర్ 5 వరకూ వాయిదా వేసింది.
ఇక అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 17ఏ కింద గవర్నర్ అనుమతి లేకుండా తనను అరెస్టు చేశారని, అరెస్టును కొట్టివేయాలని కోరుతూ చంద్రబాబు దాఖలు చేసిన క్వా,ష్ పిటీషన్‌ను ఏపీ హైకోర్టు డిస్మిస్ చేసింది. దాంతో హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు చంద్రబాబు. ఈ కేసును సుప్రీంకోర్టు సెప్టెంబర్ 27 నిన్నటికి లిస్టింగ్ అయింది. అయితే ఈ కేసు విచారించేందుకు జస్టిస్ సంజీవ్ ఖన్నా బెంచ్ విముఖత వ్యక్తం చేసింది. ఈ బెంచ్‌లో సభ్యుడైన జస్టిస్ ఎస్‌విఎన్ భట్టి చంద్రబాబు సొంత జిల్లాకు చెందిన వ్యక్తి కావడంతో నాట్ బిపోర్ మి అంశాన్ని ప్రస్తావించారు. దాంతో సుప్రీంకోర్టు మరో బెంచ్‌కు బదిలీ చేయడమే కాకుండా కేసు విచారణను అక్టోబర్ 3వ తేదీకు వాయిదా వేసింది.
ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబు దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటీషన్‌పై ఏపీ హైకోర్టులో హోరాహోరీగా వాదనలు కొనసాగాయి. ఈ కేసులో చంద్రబాబు ఏ1గా ఉన్నారు. ఇదే కేసులో చంద్రబాబు తనయుడు నారా లోకేశ్ ఏ14గా ఉంటూ ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. చంద్రబాబు బెయిల్ పిటీషన్‌పై విచారణను హైకోర్టు 29వ తేదీకు వాయిదా వేసింది.
మరోవైపు అంగళ్లు దాడి కేసులో చంద్రబాబు బెయిల్ పిటీషన్‌పై హైకోర్టులో విచారణ ముగిసి..తీర్పు రిజర్వ్ అయింది. ఈ కేసులో కూడా చంద్రబాబు ఏ1గా ఉన్నారు. ఏసీబీ కోర్టులో చంద్రబాబు బెయిల్ పిటీషన్, కస్టడీ పొడిగింపు కోరుతూ సీఐడీ పిటీషన్‌పై విచారణ అక్టోబర్ 5 కు వాయిదా పడింది.
Also read: Supreme Court: చంద్రబాబుకు సుప్రీంకోర్టులో నిరాశ, కేసు విచారణ వచ్చే వారానికి వాయిదా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Chandrababu Case: ఏసీబీ, హైకోర్టు, సుప్రీంకోర్టులో చంద్రబాబు కేసుల వివరాలు ఇలా