Bus Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రావెల్స్‌ బస్సు బోల్తా, నలుగురి మృతి..

Bus Accident In Andhra Pradesh: ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తిరుపతి నుంచి తిరుచ్చి వెళ్తున్న బస్సు బోల్తా కొట్టింది. దీంతో అందులో ఉన్న నలుగురు ప్రయాణీకులు అక్కడికక్కడే చనిపోయారు.

Written by - Renuka Godugu | Last Updated : Jan 17, 2025, 09:35 AM IST
Bus Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రావెల్స్‌ బస్సు బోల్తా, నలుగురి మృతి..

Bus Accident In Andhra Pradesh: తిరుపతి నుంచి తిరుచ్చి వెళ్తున్న ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు బోల్తా కొట్టడంతో నలుగురు చనిపోయారు. ఈ ఘటన ఈరోజు ఉదయం తెల్లవారుజామున చిత్తూరులో చోటు చేసుకుంది. గంగాసాగరం వద్ద ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుపతి నుంచి తిరుచ్చి వెళ్తున్న ట్రావెల్స్‌ బస్సు టిప్పర్‌ను తప్పించబోయి బోల్తా కొట్టింది. దీంతో ఆ బస్సులో ప్రయాణం చేస్తున్న నలుగురు చనిపోయారు. మిగతా 22 మంది ప్రయాణీకులకు గాయలయ్యాయి. ఇక క్షతగాత్రులు చిత్తూరు ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. వేగంగా వస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు టిప్పర్ ని తప్పించుకోబోయి బోల్తా పడింది. తిరుపతి నుంచి తరుచనూర్‌ ఆ ప్రాంతంలో జాతీయ రహదారి పనులు కొనసాగుతున్నాయి. ఆ పక్కనే టిప్పర్‌ నిలిపి ఉంది. రాత్రి సమయంలో చీకటిగా ఉండటంతో అతివేగంతో వస్తున్న బస్సు టిప్పర్‌ దగ్గరకు వచ్చే వరకు గమనించలేకపోయాడు డ్రైవర్‌. హఠాత్తుగా టిప్పర్‌ను  తప్పించబోవడంతో బస్సు బోల్తా పడింది. ఈ సందర్భంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మిగతా వాళ్ళు గాయపడ్డారు. ప్రయాణ సమయంలో 30 మంది వరకు బస్సులో ఉన్నట్లు తెలుస్తోంది.

Read Also: తిరుమల వెళ్లే శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఈనెల 20 నుంచి మళ్లీ పాత పద్ధతిలోనే దర్శనాలు..!

తిరుపతి గంగాసాగరం వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఇక ఈ బస్సు రంగనాథన్ ఇన్ ట్రావెల్ బస్సు గా గుర్తించారు.. క్షతగాత్రుల్లో పలువురు పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. ప్రమాదం అర్ధరాత్రి రెండు గంట సమయంలో చోటుచేసుకుంది. టిప్పర్ ని తప్పించబోయి రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్ మీదకు దూసుకెళ్లి అదుపుతప్పి 20 అడుగుల దూరం మేరకు వెళ్లి బస్సు వెళ్లిందని కరెంటు పోల్‌కు తగలడంతో నలుగురు ప్రయాణీకులు ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చిత్తూరు ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన వారిని చికిత్స అందిస్తున్నారు. ఇక జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ కూడా ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితులను ఆరా తీస్తున్నారు. గాయపడిన వారికి మెరుగైన సేవలు అందిస్తామన్నారు.
 

Read Also: ఈ 7 ఫుడ్స్ మీకు ప్రమాదకరం.. సైలెంట్‌గా మిమ్మల్ని క్యాన్సర్ రోగిగా మారుస్తాయి..

ఇక అర్ధరాత్రి  లేదా తెల్లవారుజాము సమయంలో వాతావరణంలో పొగ మంచు పేరు కోవడం వల్ల కూడా ఈ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో అతివేగం, నిద్రమత్తు కూడా కారణమవుతున్నాయి. అమాయకుల ప్రాణాలు పోతున్నాయి. ఇప్పటికే రోడ్డు ప్రయాణం చేసేవారు ముఖ్యంగా తెల్లవారుజాము సమయంలో జాగ్రత్తలు పాటించాలని పోలీసులు సూచిస్తూనే ఉన్నారు. అయినా కానీ ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.

అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. అతివేగం నిద్రమత్తుతో పాటు సెల్ఫోన్ డ్రైవింగ్ వల్ల కూడా మన దేశంలో ఎక్కువగా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ఇటీవల కొన్ని నివేదికల ప్రకారం ఎక్కువ శాతం జంతువులను అదుపు తప్పించబోయే ముఖ్యంగా కుక్కలు అదుపు తప్పించబోయి ఆక్సిడెంట్లు ఎక్కువగా జరిగాయని తెలుస్తోంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News