AP Govt announced ex-gratia to saiteja family: తమిళనాడులో హెలికాప్టర్ ప్రమాదం(Helicopter Crash)లో మృతి చెందిన చిత్తూరు జిల్లా వాసి లాన్స్‌నాయక్ సాయితేజ్(Lance Naik Saiteja) కుటుంబానికి ఏపీ ప్రభుత్వం ఆర్థిక సాయం(Ex-gratia) ప్రకటించింది. రూ.50లక్షల సాయం అందించాలని సీఎం జగన్ నిర్ణయించారు. ఈ మేరకు ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయం ట్విటర్ ద్వారా ప్రకటించింది.
Hon'ble CM Sri @ysjagan has announced Rs. 50 lac ex-gratia to the family of Lance Naik B Sai Teja, who lost his life in the tragic Coonoor chopper crash on Wednesday, that claimed 13 brave souls. He was serving as PSO to the CDS.
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) December 11, 2021
Also Read: Helicopter Crash: చిట్టితల్లిని చూడాలనుంది..వీలు కుదిరితే సాయంత్రం చేస్తాను
మరోవైపు సాయితేజ భౌతికకాయాన్ని గుర్తించిన ఆర్మీ అధికారులు స్వగ్రామానికి తరలిస్తున్నారు. దిల్లీ నుంచి ఆయన పార్థివదేహాన్ని స్వగ్రామం చిత్తూరు జిల్లా(Chittoor District)లోని ఎగువరేగడకు తరలించనున్నారు. అనంతరం అక్కడ అంత్యక్రియలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అధికార సైనిక లాంఛనాలతో అంత్యక్రియల నిర్వహణకు ఏర్పాటు చేస్తున్నారు. సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్(CDS General Bipin Rawat)కు సాయితేజ్ పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్‌గా పనిచేశారు. ఈ క్రమంలో సీడీఎస్ దంపతులు, సాయితేజ సహా మరో 11 మంది హెలికాప్టర్‌లో వెళ్తుండగా..తమిళనాడులో ఘోర దుర్ఘటన సంభవించింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook