Kuppam Tour: ఆంక్షల ప్రభావం, మూడ్రోజుల చంద్రబాబు కుప్పం పర్యటనలో నో రోడ్ షో, నో మీటింగ్

Kuppam Tour: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రభావం చూపిస్తోంది. చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంపై ఆ ప్రభావం కన్పించనుంది.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jan 3, 2023, 10:33 PM IST
Kuppam Tour: ఆంక్షల ప్రభావం, మూడ్రోజుల చంద్రబాబు కుప్పం పర్యటనలో నో రోడ్ షో, నో మీటింగ్

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సభల్లో విషాద ఘటనలు చోటుచేసుకోవడం, కందుకూరు, గుంటూరు తొక్కిసలాటల్లో 11 మంది మరణించడంతో ఏపీ ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది. సామాన్యులు ప్రాణాలు కోల్పోవడంతో జాతీయ, రాష్ట్ర, మున్సిపల్, పంచాయితీ రాజ్ రహదారులపై సభలు, సమావేశాల్ని ప్రభుత్వం రద్దు చేసింది. సభలు, ర్యాలీలకు అనుమతి లేదని స్పష్టం చేసింది. 

సభలు, సమావేశాలను రోడ్లకు దూరంగా, ప్రజలకు దూరంగా ఉండాలని సూచించింది. అధికారులు ఎంపిక చేసిన ప్రదేశాల్లోనే సభలు, ర్యాలీలు నిర్వహించాలని తెలిపింది. అరుదైన సందర్భాల్లోనే షరతులతో కూడిన అనుమతి ఉంటుందని తెలిపింది. ప్రభుత్వం విధించిన ఈ ఆంక్షల ప్రభావం నేరుగా చంద్రబాబు పర్యటనపైనే పడింది.

 

రేపట్నించి అంటే డిసెంబర్ 4,5,6 తేదీల్లో చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటించనున్నారు. ప్రభుత్వ ఆంక్షల నేపధ్యంలో చంద్రబాబు మూడ్రోజుల కుప్పం పర్యటన అసాంతం..ఏ విధమైన రోడ్ షో, సభల్లేకుండానే షెడ్యూల్ అయింది. పర్యటన అంతా విలేజ్ విజిట్, పార్టీ నేతలతో సమావేశాలకే పరిమితమైంది. 

Also read: AP Politics: ఆ విషయంలో మంత్రి ధర్మానకు, సీఎం జగన్‌కు కుదరని ఏకాభిప్రాయం, ఎన్నికలకు దూరమా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News