IPS Transfers: ఏపీలో ఐపీఎస్ బదిలీలు, రాజమండ్రి అర్బన్ ఎస్పీగా ఐశ్వర్య రస్తోగి

IPS Transfers: ఆంధ్రప్రదేశ్‌లో ఐపీఎస్ అధికారులకు స్థానచలనం కల్గింది. రాష్ట్రంలో 13 మంది ఐపీఎస్ అధికారుల్ని బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొందరికి స్థాన చలనం కలిగితే.. మరికొందరికి డీజీపీ ఆఫీసులో రిపోర్టింగ్‌కు ఆదేశాలొచ్చాయి.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jul 14, 2021, 12:46 PM IST
  • ఏపీలో 13 మంది ఐపీఎస్ అధికారుల బదిలీలు, ఉత్తర్వులు విడుదల చేసిన ప్రభుత్వం
  • గత కొద్దికాలంగా ఎదురు చూస్తున్న బదిలీలు
  • రాజమండ్రి అర్బన్ ఎస్పీగా ఐశ్వర్య రస్తోగి
IPS Transfers: ఏపీలో ఐపీఎస్ బదిలీలు, రాజమండ్రి అర్బన్ ఎస్పీగా ఐశ్వర్య రస్తోగి

IPS Transfers: ఆంధ్రప్రదేశ్‌లో ఐపీఎస్ అధికారులకు స్థానచలనం కల్గింది. రాష్ట్రంలో 13 మంది ఐపీఎస్ అధికారుల్ని బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొందరికి స్థాన చలనం కలిగితే.. మరికొందరికి డీజీపీ ఆఫీసులో రిపోర్టింగ్‌కు ఆదేశాలొచ్చాయి.

ఏపీలో గత కొద్దికాలంగా ఎదురుచూస్తున్న ఐపీఎస్ అధికారుల బదిలీలు(IPS Transfers) జరిగాయి. మొత్తం 13మంది ఐపీఎస్ అధికారుల్ని బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాజమండ్రి అర్బన్ ఎస్పీగా ఉన్న డాక్టర్ షీమోషి విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎస్పీగా బదిలీ కాగా..ఆమె స్థానంలో అంటే రాజమండ్రి అర్బన్ ఎస్పీ(Rajahmundry urban sp) గా ఐశ్వర్య రస్తోగి (Aiswarya Rasthogi) వచ్చారు. విశాఖపట్నం డీసీపీ-1 గా పనిచేస్తున్న రస్తోగిని రాజమండ్రి అర్బన్ ఎస్పీగా బదిలీ చేశారు. ఇక పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీగా రాహుల్ దేవ్ శర్మ, ఆక్టోపస్ ఎస్పీగా కోయ ప్రవీణ్ బదిలీ అయ్యారు. ఇందులో కోయ ప్రవీణ్‌కు పీటీవోగా అదనపు బాధ్యతలు కూడా అప్పగించారు. 

ఇక విజయనగరం ఏపీఎస్పీ బెటాలియన్ కమాండెంట్‌గా విక్రాంత్ పాటిల్, డీజీపీ ఆఫీస్ లా అండ్ ఆర్డర్ ఏఐజీగా అమ్మిరెడ్డి, ప్రకాశం జిల్లా ఎస్పీగా మల్లికా గార్గ్, విజయవాడ రైల్వే ఎస్పీగా రాహుల్‌దేవ్ సింగ్, మంగళగిరి ఏపీఎస్పీ బెటాలియన్ కమాండెంట్‌గా అజిత వేజెండ్ల, కాకినాడ ఏపీఎస్పీ బెటాలియన్ కమాండెంట్‌గా జీఎస్ సునీల్, విశాఖపట్నం డీసీపీ-1 గా గౌతమి శాలి, ఇంటెలిజెన్స్ సీఎం ఎస్‌జి ఎస్పీగా వకుల్ జిందాల్‌లు బదిలీ అయ్యారు. నారాయణ నాయక్‌ను మాత్రం డిజీపీ(DGP) కార్యాలయంలో రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశాలు అందాయి.

Also read: Krishna water Dispute: కృష్ణా జలాల వివాదంపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఏపీ ప్రభుత్వం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News