CM YS Jagan: జి-20 సన్నాహక సమావేశంలో ప్రధాని వద్ద మార్కులు కొట్టేసిన సీఎం జగన్‌

CM YS Jagan Meets PM Modi: భారత్‌లో 2023 సెప్టెంబర్‌లో జరగనున్న జి-20 దేశాధినేతల ప్రతిష్టాత్మక సదస్సుకు భారత్ అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించనున్న క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ అన్ని రాజకీయ పార్టీల అధినేతలను ముందస్తు సమావేశానికి ఆహ్వానించిన సంగతి తెలిసిందే. 

Written by - Pavan | Last Updated : Dec 6, 2022, 04:42 AM IST
CM YS Jagan: జి-20  సన్నాహక సమావేశంలో ప్రధాని వద్ద మార్కులు కొట్టేసిన సీఎం జగన్‌

CM YS Jagan Meets PM Modi: న్యూఢిల్లీ: వచ్చే ఏడాది భారత్‌లో జరగనున్న జి-20 దేశాధినేతల ప్రతిష్టాత్మక సదస్సుకు భారత్‌ వేదిక కానుండంపై ఏపీ సీఎం వైయస్‌ జగన్‌ సంతోషం వ్యక్తంచేశారు. ఈ విషయంలో ప్రధాని మోదీకి ఆయన అభినందనలు తెలియజేశారు. జి-20 సదస్సు సన్నాహకాలు, వ్యూహాల ఖరారులో భాగంగా ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లోని అశోకా హాలులో సోమవారం జరిగిన సమావేశానికి సీఎం వైయస్‌ జగన్‌ హాజరయ్యారు. 

ఈ సందర్భంగా సమావేశానికి హాజరైన వారిని ఉద్దేశించి సీఎం వైయస్ జగన్ మాట్లాడుతూ... జి-20 దేశాల సదస్సు కోసం చేసే ఏర్పాట్లు, దానికోసం జరిగే సన్నాహకాల్లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి, రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి బాధ్యతను అప్పగించినా నెరవేర్చడానికి తాము సిద్ధంగా ఉన్నామని అన్నారు. ఈ ప్రతిష్టాత్మక సదస్సు విజయవంతం కావడానికి అన్నిరకాలు తాము సహాయ సహకారాలు అందిస్తామని సీఎం వైయస్ జగన్ స్పష్టంచేశారు. 

జి-20 అధ్యక్ష పదవిని భారత్‌ చేపట్టిన శుభ సందర్భంలో రాజకీయ కోణంలో వ్యాఖ్యలు చేయడం సరికాదని, అంతర్జాతీయ సమాజం భారత్ వైపు చూస్తున్న నేపథ్యంలో అందరూ ఒక్కతాటిపైకి రావాల్సిన అవసరం ఉందని సీఎం జగన్ తేల్చిచెప్పారు. రాజకీయ పార్టీల మధ్య విభేదాలు ఉండటం సహజమే అయినా.. వాటిని మనవరకే పరిమితం చేసుకుని జి-2౦ సదస్సును మాత్రం మనందరిదిగా భావించి విజయవంతం చేయడానికి ప్రతీ ఒక్కరం కలిసికట్టుగా కృషి చేయాల్సిన అవసరం ఉందని సీఎం జగన్ అభిప్రాయపడ్డారు. 

Trending News