CID Files Chargesheet On Chandrababu In IRR Case: ఎన్నికలకు సన్నద్ధమవుతున్న చంద్రబాబుకు భారీ షాక్ తగిలింది. ఇప్పటికే బెయిల్‌పై ఉన్న చంద్రబాబును సీఐడీ వదిలిపెట్టేలా లేదు. తాజాగా ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో అతడిని ప్రధాని నిందితుడిగా పేర్కొంటూ చార్జ్‌షీట్ దాఖలు చేసింది. మాజీ మంత్రి నారాయణను ఏ2గా పేర్కొంటూ కోర్టులో పిటిషన్ వేసింది. ఈ మేరకు విజయవాడలోని ఏసీబీ కోర్టులో సీఐడీ చార్జ్‌షీట్ వేసింది. సింగపూర్ ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందం తప్పుగా తేల్చింది.
Also Read: YS Sharmila Security: చెల్లెమ్మకు భద్రత పెంచిన జగన్ అన్నయ్య.. 2+2 భద్రత పెంపు
చంద్రబాబు తనయుడు, మాజీ మంత్రి నారా లోకేశ్‌తోపాటు లింగమనేని రాజశేఖర్, రమేశ్‌లను ముద్దాయిలుగా చేరుస్తూ నిర్ణయించింది. సింగపూర్‌తో చంద్రబాబు ప్రభుత్వం తప్పుడు ఒప్పందం చేసుకుందని చార్జిషీట్‌లో సీఐడీ పేర్కొంది. ఆ ప్రభుత్వం ఏపీ ప్రభుత్వం మధ్య ఒప్పందమే జరగలేదని స్పష్టం చేసింది. అలాంటి ఒప్పందమే లేదని సీఐడీ నిర్ధారించింది. సింగపూర్‌తో చేసుకున్న ఒప్పందానికి కేంద్ర ప్రభుత్వ అనుమతిలేదని పేర్కొంది. చట్టవిరుద్ధంగా మాస్టర్ ప్లాన్ పేరుతో సుర్బానా జురాంగ్‌కు డబ్బు చెల్లింపులు చేసినట్టు చార్జ్‌షీట్‌లో వివరించింది. నిందితులకు మేలు చేసేలా ఇన్నర్ రింగ్‌రోడ్డు, సీడ్ క్యాపిటల్, మాస్టర్ ప్లాన్ రూపొందించినట్టు సీఐడీ తెలిపింది.
ఇన్నర్ రింగ్‌రోడ్డుని లింగమనేని భూములు, హెరిటేజ్ భూములు, నారాయణ భూములకు మార్చినట్టు సీఐడీ చార్జ్‌షీట్‌లో పేర్కొంది. 58 ఎకరాల భూములను బంధువుల పేరుతో మాజీమంత్రి నారాయణ కొన్నారు. లింగమనేని 340 ఎకరాల ల్యాండ్ బ్యాంకుకి మేలు చేసేలా అలైన్‌మెంట్ మార్పులు చేశారు. లింగమనేని నుండి చంద్రబాబుకు ఇంటిని ఇచ్చినట్టు సీఐడీ తెలిపింది. లింగమనేని ల్యాండ్ బ్యాంక్ పక్కనే హెరిటేజ్ 14 ఎకరాల భూములు కొన్నట్టు చార్జ్‌షీట్‌లో వెల్లడించింది. ఈ భూములకు విలువ పెరిగేలా ఇన్నర్ రింగ్‌రోడ్డు అలైన్‌మెంట్ మార్చినట్టు సీఐడీ నిర్ధారించింది.
కేసు ఇదే..
అమరావతి మాస్టర్ ప్లాన్‌లో భాగంగా ఇన్నర్ రింగ్ రోడ్డు, ఇతర రోడ్ల అలైన్‌మెంట్ మార్పులు చేసి అక్రమాలకు పాల్పడ్డారని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదుతో ఈ కేసు నమోదైంది. ఏపీ సీఐడీ విచారణ చేపట్టి చంద్రబాబును ఏ1గా ప్రకటించింది. ఈ కేసులో చంద్రబాబు ప్రమేయంపై సీఐడీ 470 పేజీల అదనపు అఫిడవిట్ దాఖలు చేసింది. హెరిటేజ్ భూముల కొనుగోలు, ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధం ఉందని, అలైన్‌మెంట్ మార్పు వివరాలతో కూడిన దాదాపు 200 అంశాలతో అఫిడవిట్ దాఖలు చేసింది. ఈ కేసులో జనవరి 10వ తేదీన చంద్రబాబుకు హైకోర్టు బెయిల్ ఇస్తూ తీర్పునిచ్చిన విషయం తెలిసిందే.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
IRR Chargesheet: చంద్రబాబుకు భారీ షాక్.. ఐఆర్‌ఆర్ కుంభకోణంలో ఉచ్చు బిగిస్తున్న సీఐడీ