Electricity Bills: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మళ్లీ ఫోన్ పేలో కరెంట్ బిల్లులు.. కీలక నిర్ణయం తీసుకున్న డిస్కమ్ అధికారులు..

AP Pay Power Bill In Phonepe: ఆంధ్ర ప్రదేశ్ లో కరెంట్ బిల్లుల చెల్లింపు విషయంలో  డిస్కమ్ అధికారులు గుడ్ న్యూస్ చెప్పారు. గతంలో మాదిరిగానే వినియోగ దారులు ఫోన్  పేలలో తమ కరెంట్ బిల్లులను కట్టుకొవచ్చని తెలిపారు.

Written by - Inamdar Paresh | Last Updated : Aug 14, 2024, 05:22 PM IST
  • ఫోన్ పేల్లో విద్యుత్ బిల్లులు..
  • కీలక ఆదేశాలు జారీచేసిన డిస్కమ్ ..
Electricity Bills: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మళ్లీ ఫోన్ పేలో కరెంట్ బిల్లులు.. కీలక నిర్ణయం తీసుకున్న డిస్కమ్ అధికారులు..

Andhra Pradesh apepdcl electricity bill can pay through phonepe again: సాధారణంగా ఫోన్ పే, గుగూల్ పే వంటి ప్లాట్ ఫామ్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు ఆన్ లైన్ లలో అన్నిరకాల చెల్లింపులు చేస్తున్నారు. ఇంట్లో నుంచి అడుగు బైటకు పెట్టకుండానే.. కేవలం ఉన్న చోటు నుంచి అన్నిరకాల వెసులుబాట్లు ఉపయోగించుకుంటూ అన్నిరకాలు చెల్లింపులను ఆన్ లైన్లలో చేసేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల విద్యుత్ డిస్కమ్ లు కరెంట్ బిల్లుల కోసం ఫోన్ పే, గుగూల్ పేలలో చెల్లించకుడదంటూ కొత్త రూల్ ను తీసుకొచ్చాయి.

కేవలం.. డిస్కమ్ లకు చెందిన ఏపీఈపీడీసీఎల్ వంటి స్కాన్ లో మాత్రమే చెల్లించాలని సూచించింది. దీంతో ఇది కాస్త వినియోగ దారుల పాలిట గందర గోళంగా మారింది. కరెంట్ వినియోగ దారులు.. ప్రస్తుతం కొత్త ఏపీఈపీడీసీఎల్  స్కానింగ్ లో విద్యుత్ చెల్లింపుల్లో ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది. గత నెల రోజులుగా విద్యుత్ చెల్లింపుల విధానం పూర్తిగా తగ్గిపోయిందని డిస్కమ్ సంస్థలు గమనించాయి.

వినియోగ దారులు ఫోన్ పేలు, ఇతర మాధ్యమాలలో చెల్లింపులుఎప్పటికప్పుడు చేసేవారని గుర్తించింది.దీంతో ఇది మరల ఇబ్బందికరంగా మారడంతో ఏపీఈపీడీసీఎల్ డిస్కమ్ అధికారులు కాస్త.. ఈ విషయంపైన యూటర్న్ తీసుకున్నారు. వినియోగదారులు గతంలో మాదిరిగా ఫోన్ పేలలో కరెంట్ బిల్లుల్ని చెల్లించవచ్చిన క్లారిటీ ఇచ్చారు.

 గతంలో వినియోగదారులు ప్రతి నెలా విద్యుత్ కార్యాలయాలకు వెళ్లి క్యూలలో గంటల తరబడి నిలబడి బిల్లులు చెల్లించేవారు. ఆ తర్వాత డిజిటల్ చెల్లింపులవైపు ప్రొత్సహించారు. ఈ నేపథ్యంలో..  ఫోన్ పే, గూగుల్ పే ద్వారా డబ్బుల్ని చెల్లించేవారు. అంతా సాఫీగా సాగిపోతున్నసమయంలో.. ఆర్‌బీఐ మార్గదర్శకాలను అనుసరించి నెల క్రితం ఫోన్‌పే, గూగుల్‌పే చెల్లింపులు కుదరవని డిస్కంలు నిర్ణయం తీసుకున్నాయి.

మొన్నటి వరకు ఫోన్‌ పే, గూగుల్‌ పేల సాయంతో వినియోగదారులు సులభంగా విద్యుత్‌ బిల్లుల చెల్లించారు. కొత్తగా వచ్చిన ఏపీఈపీడీసీఎల్‌ యాప్‌, వెబ్‌ సైట్‌ ద్వారా చెల్లింపుల విషయంలో కొంత ఇబ్బందులకు గురౌతున్నారు. ఈ క్రమంలోనే విద్యుత్‌ రెవెన్యూ కార్యాలయాలు, కరెంట్ బిల్లుల చెల్లింపు కేంద్రాల దగ్గర క్యూ లైన్లు కనిపించాయి.

Read more: Viral video: బాప్ రే.. నరాలు తెగే ఉత్కంఠ.. సింహాలు, కుక్కల ఫైటింగ్.. సడెన్ గా తెర్చుకున్న గేట్.. ఆ తర్వాత..  

ఫోన్‌ పే, గూగుల్‌ పే చెల్లింపుల నిలిచిపోవడంతో సీపీడీసీఎల్‌ పరిధిలో రూ. కోట్లలోనే చెల్లింపుల బకాయిలు నిలిచిపోయినట్లు తెలుస్తోంది. భారీగా బకాయిలు ఉండటంతో.. ఉన్నతాధికారులు ఫోన్‌ పేతో కూడా చెల్లింపులు పునరుద్ధరించినట్లు సమాచారం. మరో నాలుగైదు రోజుల్లో గూగుల్‌పేతో కూడా విద్యుత్‌ బిల్లుల చెల్లింపులు అందుబాటులో తీసుకొస్తామని డిస్కమ్ అధికారులు పేర్కొన్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News