Krishnapatnam Medicine: మందు పంపిణీకు ప్రభుత్వ సహకారం లేదు : ఆనందయ్య

Krishnapatnam Medicine: కృష్ణపట్నం కరోనా మందు పంపిణీ కొనసాగుతోంది. మందు పంపిణీకు అనుమతించినా ఆనందయ్య మాత్రం అప్పుడప్పుడూ ఆగ్రహం వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఇవాళ ప్రభుత్వంపై మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jun 23, 2021, 07:25 PM IST
Krishnapatnam Medicine: మందు పంపిణీకు ప్రభుత్వ సహకారం లేదు : ఆనందయ్య

Krishnapatnam Medicine: కృష్ణపట్నం కరోనా మందు పంపిణీ కొనసాగుతోంది. మందు పంపిణీకు అనుమతించినా ఆనందయ్య మాత్రం అప్పుడప్పుడూ ఆగ్రహం వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఇవాళ ప్రభుత్వంపై మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆనందయ్య కరోనా మందు (Corona medicine) దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. వివిధ రకాల పరిశీలన, అధ్యయనం అనంతరం ఏపీ ప్రభుత్వం ఆనందయ్య మందుకు అనుమతిచ్చింది. అప్పట్నించి ఆనందయ్య మందు (Anandaiah Medicine)పంపిణీ తిరిగి ప్రారంభమైంది. అయితే ప్రభుత్వం సహకరించడం లేదంటూ ఇప్పటికే 2-3 సార్లు ఆనందయ్య విన్నవించిన పరిస్థితి ఉంది. ఇవాళ మరోసారి రాష్ట్ర ప్రభుత్వంపై ఆనందయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా మందును కనిపెడితే..ఆ మందు ప్రజలకు అందకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. మందు పంపిణీకు ప్రభుత్వం (Ap government) సహకరించకపోవడం బాధాకరమని తెలిపారు. మందు పంపిణీ కోసం ప్రభుత్వానికి లేఖ రాశానని..ఎలాంటి స్పందన లేదని వాపోయాడు. 

సరైన సామగ్రి లేక మందు తయారీ విషయంలో వెనుకబడ్డానని..దాతల సహకారంతో ప్రజలకు మందు పంపిణీ చేస్తున్నానని ఆనందయ్య (Anandaiah)తెలిపారు. పార్టీలతో సంబంధం లేకుండా అందరికీ కరోనా మందును అందిస్తున్నట్టు చెప్పారు. రాష్ట్రంలో బడ్డీ బంకుల్లో మందు పంపిణీ జరుగుతోందంటే..ప్రభుత్వ లోపమని...ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. 

Als read: AP Corona Update: ఏపీలో తగ్గుతున్న కరోనా పాజిటివ్ కేసులు, వ్యాక్సిన్ డ్రైవ్ ఎఫెక్ట్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News