Anandaiah Medicine Latest News: నెల్లూరు జిల్లా కృష్ణపట్నానికి చెందిన ఆనందయ్య తయారు చేసిన ఔషధాన్ని ఏపీలోని అన్ని ప్రాంతాలకు పంపిణీ చేస్తున్నారు. పలు పరీక్షలు చేసి, నిపుణులు ఇచ్చిన రిపోర్టుల ఆధారంగా ఆనందయ్య కరోనా ఔషధానికి ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
Krishnapatnam Medicine: కృష్ణపట్నం కరోనా మందు పంపిణీ కొనసాగుతోంది. మందు పంపిణీకు అనుమతించినా ఆనందయ్య మాత్రం అప్పుడప్పుడూ ఆగ్రహం వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఇవాళ ప్రభుత్వంపై మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు.
Anandaiah Eye Drops Latest Update: ఇదివరకే ఆనందయ్య తయారు చేసే మందుకు అనుమతి రావడంతో పంపిణీ కొనసాగుతోంది. చుక్కుల మందుపై మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. రిపోర్టులలో తేలిన విషయాలను ఏపీ ప్రభుత్వ తరఫు న్యాయవాది హైకోర్టుకు వెల్లడించారు.
Anandaiah letter To AP CM YS Jagan Mohan Reddy: ఔషధానికి ఏపీ ప్రభుత్వం నుంచి అనుమతి లభించినా, మందు తయారీ పంపిణీ విషయంలో ఎలాంటి సహకారం అందడం లేదని కృష్ణపట్నానికి చెందిన ఆనందయ్య సోమవారం వ్యాఖ్యానించడం తెలిసిందే. ఈ క్రమంలో తమకు సహకారం అందించాలని కోరుతూ ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఆనందయ్య లేఖ రాశారు.
Krishnapatnam Anandaiah Comments On AP Govt over Medicine Diatribution: మొదటగా సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలకు మాత్రమే కరోనా మందు పంపిణీ చేయడానికి నిర్ణయించుకున్నామని ఆనందయ్య తెలిపారు. ఎందుకంటే స్థానిక ప్రజలకు ఇచ్చిన తరువాతే ఇతర ప్రాంతాల వారికి ఔషధం పంపిణీ చేయాలనుకున్నామని ఆనందయ్య తెలిపారు.
Krishnapatnam Anandaiah Medicine: సొంత నియోజకవర్గమైన సర్వేపల్లి ప్రజలకు ఆనందయ్య కరోనా మందును పంపిణీ చేయాలని భావిస్తున్నారు. ఆ తరువాత రాష్ట్ర ప్రజలకు, ఇతర రాష్ట్రాల వారికి ఆనందయ్య తయారుచేస్తున్న ఔషధాన్ని ఇవ్వాలనుకున్నారు.
Anandayya Covid-19 Medicine Home Delivery: మూలికలు, ఆకులు, వంటింటి ధాన్యాలతో ఆనందయ్య తయారు చేస్తున్న ఔషధానికి అనుమతి లభించినా, నివేదిక రాని కారణంగా చుక్కల మందుకు ప్రస్తుతానికి అనుమతి ఇవ్వలేదు. ఆనందయ్య తయారు చేస్తున్న ఔషధాన్ని పంపణీ చేయాలని భావించిన టీటీడీ ఒక్కసారిగా వెనక్కి తగ్గింది.
AP Govt Gives Permission To Anandaiah Ayurvedic Medicine: కరోనాతో పోరాడుతూ రిటైర్డ్ హెడ్ మాస్టర్ కోటయ్య చనిపోయిన రోజే ఆనందయ్య ఆయుర్వేద మందుకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.