Chandrababu Davos Tour: 'పెట్టుబడులు తీసుకువస్తామని చెప్పి దావోస్ పర్యటన చేపట్టిన చంద్రబాబు బృందానికి దారి ఖర్చులు కూడా రాలేదు' అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. దావోస్ పర్యటనతో ఏపీకి జరిగిన ప్రయోజనం ఏమిటో ప్రభుత్వం చెప్పాలని కోరారు. హైదరాబాద్‌ను తానే అభివృద్ధి చేశానని డబ్బా కొట్టుకున్న చంద్రబాబు దావోస్ వెళ్లి తీసుకొచ్చింది సున్నా అని ఎద్దేవా చేశారు.
Also Read: Vijayasai Reddy: వైఎస్ వివేకా హత్యపై సంచలనం రేపిన విజయసాయి రెడ్డి వ్యాఖ్యలు
విశాఖపట్టణం పర్యటనకు వచ్చిన మాజీ మంత్రి అంబటి రాంబాబు ఎయిర్‌పోర్టులో మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు దావోస్ పర్యటనపై స్పందించారు. ఈ సందర్భంగా చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. 'దావోస్ పర్యటనకు వెళ్లి ఎన్ని కంపెనీలు.. ఎన్ని పెట్టుబడులు తీసుకొచ్చారో ప్రజలకు చెప్పవలసిన బాధ్యత చంద్రబాబు ప్రభుత్వానికి ఉంది' అని ప్రకటించారు. 'హైదరాబాద్‌ని నేనే అభివృద్ధి చేశాను అని డబ్బా కొట్టుకున్న చంద్రబాబు దావోస్ వెళ్లి తీసుకొచ్చింది సున్నా' అని విమర్శించారు.
Also Read: Vijayasai Reddy: వైఎస్ జగన్‌కు భారీ షాక్.. విజయ సాయిరెడ్డి రాజకీయాల నుంచి రిటైర్మెంట్
'మా గుంటూరు సైడ్ ఒక సామెత ఉంది. డొంక ఈతకి లంక మేతకి అన్నట్లు ఉంది ఈ దావోస్ పర్యటన' అని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. 'ఒక మంత్రిమో దావోస్ వెళ్లి రెడ్ బుక్ కోసం మాట్లాడుతున్నాడు. దావోస్ వెళ్లి పరిశ్రమల కోసం మాట్లాడకుండా లోకేష్ ముఖ్యమంత్రి కావాలని మాట్లాడుతున్నాడు పరిశ్రమల మంత్రి' అని విమర్శించారు. 'ఏడు నెలల్లోనే ఈ కూటమి ప్రభుత్వం బండారం బయట పడింది' అని అసంతృప్తి వ్యక్తం చేశారు.
'మా గుంటూరులో మరో సామెత ఉంది. విశాఖపట్నంలో ఈ సామెత ఉందో లేదో తెలియదు. సింగడు అద్దంకి వెళ్లి వచ్చాడంట. ఎందుకెళ్లావంటే వెళ్లి రమ్మన్నారు వెళ్లి వచ్చాను అంతే అన్నాడట' అన్నట్టుగా చంద్రబాబు తీరు ఉందని మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. 'ఎవరు అభివృద్ధి చేసినా చేయకపోయినా హైదరాబాద్ తర్వాత సహజ వనరులు ఉన్న విశాఖపట్నం అభివృద్ధి చెందుతుంది' అని స్పష్టం చేశారు. అమరావతిని ఎంత అభివృద్ధి చేసినా వరదలు వస్తే నీట మునగడమే అని అంబటి చెప్పారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.