Guntur District Road Accident News: గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం (Road Accident in Guntur District) జరిగింది. విద్యుత్ స్తంభాన్ని బైకు ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు విద్యార్థులు దుర్మరణం చెందారు. ఈ ప్రమాదం మంగళగిరి మండలం కృష్ణాయపాలెం వద్ద చోటుచేసుకుంది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతులు.. గుంటూరు జిల్లా పెనుమాక వాసులుగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు.
జీలుగు కల్లు తాగి ఐదుగురు మృతి
తూర్పుగోదావరి జిల్లా మన్యంలో విషాదం చోటుచేసుకుంది. జీలుగు కల్లు తాగి.. ఐదుగురు మృతి చెందారు. రాజవొమ్మంగి మండలంలోని మారుమూల గిరిజన గ్రామం లోదొడ్డిలో ఈ దుర్ఘటన సంభవించింది. ఐదుగురు జీలుగు కల్లు తాగి.. తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిని కాకినాడ జీజీహెచ్‌కు తరలిస్తుండగా మార్గ మధ్యలో ఇద్దరు చనిపోయారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో ముగ్గురు ప్రాణాలు విడిచారు. ఏపీ ప్రభుత్వ మద్యం విధానం కారణంగానే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు (Tdp Chief Chandrababu)ధ్వజమెత్తారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.25 లక్షల పరిహారం అందించాలని డిమాండ్ చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook