Welwitschia: మొక్కలు సాధారణంగా బతికేది నెలలు లేదా సంవత్సరాలు. భారీ చెట్లైతే వందల ఏళ్లు బతుకుతాయి. మరి ఆ మొక్కకు ఉండేది రెండే ఆకులు కానీ బతికేది మాత్రం రెండు వేల సంవత్సరాలకు పైనే. ఆశ్చర్యంగా ఉందా. నిజమే
ఆ మొక్కకు ఉండేది రెండే రెండు ఆకులు. కానీ బతికేది మాత్రం రెండు వేల సంవత్సరాలకు పైనే.కేవలం రెండు మూడు అడుగుల పొడుగుండే చిన్న మొక్క ఆయుష్షు మాత్రం ఎక్కువే. ఆ మొక్క పేరు వెల్విస్చియా. భూమ్మీద అత్యంత పురాతన ఎడారుల్లో ఒకటైన నమీబియా ఎడారిలోనే(Namibia Deserts) ఈ మొక్కలు దర్శనమిస్తాయి. ఆస్ట్రియా జీవ శాస్త్రవేత్త ఫ్రెడ్రిక్ వెల్విస్చ్ 1859లో ఈ మొక్కల్ని గుర్తించారు. ఆయన పేరు మీదుగానే ఈ మొక్కకు ఆ పేరు పెట్టారు.
వెల్విస్చియా (Welwitschia plant) మొక్కల్ని ఆఫ్రికాలో స్థానికంగా ట్విబ్లార్కన్నీడూడ్ అని పిలుస్తారు. దీనర్ధం ఎప్పటికీ చావులేని రెండు ఆకులని అర్ధం. అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్ని తట్టుకుని మరీ వేల ఏళ్లు బతుకుతుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. రెండు ఆకులు పొడవు పెరిగే కొద్దీ చీలిపోతూ విస్తరిస్తాయి. కొన్ని మొక్కల్ని తీసుకుని పరీక్షించినప్పుడు..దాదాపు 3 వేల ఏళ్ల క్రితం పుట్టి ఇంకా బతుకుతున్నట్టు గుర్తించారు. మరికొన్నింటి వయస్సు వెయ్యేళ్లకు పైనే ఉందట. అధిక ఉష్ణోగ్రతలు, నీటి కొరత వంటి క్లిష్ట పరిస్థితుల్ని తట్టుకుంటూ అతి తక్కువ శక్తిని వినియోగించుకునేలా మొక్కల్లో జన్యు మార్పుల్ని శాస్త్రవేత్తలు గుర్తించారు.
Also read: ఆప్ఘనిస్తాన్‌లో మరోసారి పెట్రేగుతున్న యుద్ధ పరిస్థితులు, ఐక్యరాజ్యసమితి ఆందోళన
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook