US Jennifer Flewellen Woke UP From COMA: మనం చాలా సార్లు వైద్యరంగంలో కొన్ని సార్లు అద్భుతాలు జరిగినట్లు వార్తలలో వింటుంటాం. మెయిన్ గా బ్రెయిన్ పనిచేయకుండా చాలా మంది కోమాలోకి వెళ్లిపోతారు. కొన్నేళ్లపాటు కాళ్లు, చేతులు చచ్చుబడిపోతుంటారు. ఇలాంటి సందర్భాలలో బాధితులు ఏదో మిరాకిల్ మాదిరిగా జరిగి ఉన్న ఫళంగా మాములు మనుషులుగా లేచికూర్చుంటారు. వీరి ప్రవర్తనను చూసి వైద్యులు కూడా ఆశ్యర్యపోతుంటారు. అస్సలు బతకడన్న వారు కూడా తిరిగి బతికి అందరికి షాకింగ్ కు గురిచేస్తుంటారు. అచ్చం ఇలాంటి కోవకు చెందిన ఘటన ప్రస్తుతం వైరల్ గా మారింది.
Read More: Yatra 2 Movie: తండ్రికి ఇచ్చిన మాటను నిలబెట్టుకునే కొడుకు కథే ‘యాత్ర 2’: దర్శకుడు మహి వీ రాఘవ్
పూర్తి వివరాలు..
అమెరికాలోని మిచిగాన్ కు చెందిన కారు ప్రమాదం జరిగింది. తీవ్రంగా గాయపడిన యువతి జెన్నిఫర్ ఫ్లెవెల్లెన్ కోమాలోకి వెళ్లిపోయింది. ఆమెను వైద్యులు ఐసీయూలో ఉంచి మరీ ట్రీట్మెంట్ చేశారు. కానీ ఆమె శరీరంలో ఎక్కడ స్పందన మాత్రం ఉంది. ఈ క్రమంలో.. జెన్నిఫర్ ఫ్లెవెల్లెన్ 2022 సంవత్సరం ఆగస్ట్ 25న ఒక్కసారిగా స్పందించింది. ఆమె బెడ్ మీద పడుకుని ఉన్న ఆ తల్లిమాత్రం నిరాశ చెందకుండా ఆమెతో మాట్లాడుతూ, జోకుతు చెప్తు ఉండేది.
ఈ క్రమంలో ఆగస్టు 25న ఒక్కసారిగా నవ్వుతూ కళ్లు తెరిచి తన తల్లిని చూసింది. ఆ సమయంలో ఆమె తల్లి కళ్లనుంచి, ఆనందం కన్నీళ్లుగా బైటకొచ్చింది. ఈ ఘటన పై తాజాగా, జరిగిన ఇంటర్వ్యూలో ఆమె తల్లి చెప్పడంతో వెలుగులోకి వచ్చింది. యూఎస్ లోని ఒక ఇంటర్వ్యూలో.. Mrs ఫ్లెవెల్లెన్ తల్లి పెగ్గి మీన్స్ మాట్లాడుతూ.. తన కూతురు నిద్రలేచినప్పుడు, ఆమె నవ్వుతూ ఉండటంతో మొదట నన్ను భయపెట్టిందని చెప్పింది. ఆమె ఎప్పుడూ అలా చేయలేదు," అని మీన్స్ పీపుల్‌తో చెప్పింది. కానీ కాసేటికి తెరుకుని తన కూతురు నవ్వుతూ తన వైపు చూడటంతో సంబర పడ్డానని చెప్పుకొచ్చింది.
Mr ఫ్లెవెల్లెన్ 5 సంవత్సరాల పాటు కోమాలో ఉన్న కూడా.. ఆమె తల్లి కూతురుతో మాట్లాడుతూ, జోక్ లు చెబుతుండేది. తన కూతురు కోసం ఎంతో కష్టపడేది. 60 ఏళ్ల వయసున్న కూడ కూతురు కోసం తల్లి మీన్స్ పడిన కష్టానికి ఫలితం దక్కిందని అందరు అంటున్నారు. ఇది వైద్యరంగంలో చాలా అరుదైన ఘటన అని.. డాక్టర్ రాల్ఫ్ వాంగ్, మిచిగాన్ యొక్క మేరీ ఫ్రీ బెడ్ రిహాబిలిటేషన్ హాస్పిటల్‌లోని ఆమె వైద్యుడు తెలిపారు.
Read More: Fish Load Lorry: రోడ్డుపై విలవిలలాడిన చేపలు.. జాలి లేకుండా వాటిపైనే వెళ్లిన వాహనాలు
"కేవలం మేల్కొలపడం మాత్రమే కాదు, ఆమె పూర్తిగా కోలుకుందని కూడా చెప్పారు. కేవలం.. 1-2% మంది బాధితుల్లో మాత్రమే ఇలా జరుగుతుందన్నారు. కోమాలో నుంచి బైటపడ్డ జెన్నిఫర్ తన కొడుకు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. తన తల్లి తిరిగి కోలుకోవడంతో అతను కూడా ఆనందంవ్యక్తం చేశాడు. ప్రస్తుతం ఈ మిరాకిల్ ఘటన మాత్రం వార్తలలో నిలిచింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook