United States: అగ్రరాజ్యం అమెరికా(United States)లో పురుషులు, మహిళలు కాని ఎల్‌జీబీటీక్యూ(లెస్బియన్, గే, బైసెక్సువల్, ట్రాన్స్‌జెండర్, క్యూర్) వర్గం పౌరుల హక్కులను గుర్తించే ప్రక్రియలో భాగంగా..ముందడుగు పడింది. శ్వేతసౌధం '‘ఎక్స్’' జెండర్(X gender Passport) హోదా కలిగిన తొలి పాస్‌పోర్టు జారీ చేసింది. ఇది చరిత్రాత్మక పరిణామం, పండుగ చేసుకోవాల్సిన సందర్భం అని ఎల్‌జీబీటీ(LGBT) హక్కుల కార్యకర్త జెస్సికా స్టెర్స్ వ్యాఖ్యానించారు. అయితే, ‘'ఎక్స్'’జెండర్ పాస్‌పోర్టును ఎవరికి జారీ చేశారన్న వివరాలను ప్రభుత్వం బయటపెట్టలేదు.
Also read: terrorists attack: అమెరికాకు పొంచి ఉన్న ఉగ్రవాదుల ముప్పు
గోప్యత(Privacy)ను కాపాడాలన్న ఉద్దేశంతోనే పోస్‌పోర్టు దరఖాస్తుదారుల సమాచారాన్ని బహిర్గతం చేయట్లేదని అధికారులు చెప్పారు. కొలరాడో(Colorado)లో నివసించే 'డానా జిమ్' అనే వ్యక్తి ‘ఎక్స్’ జెండర్ పాస్‌పోర్టు కోసం 2015 నుంచి అమెరికా ప్రభుత్వం(America Government)తో పొరాడుతున్నారు. పురుషుడిగా జన్మించి డానా జిమ్(Dana Zzyym) కొంతకాలం అమెరికాలో సైన్యంలో పనిచేశారు. లింగ మార్పిడి చేయించుకొని మహిళగా మారారు. తన లాంటి వారి హక్కుల కోసం ఉద్యమిస్తున్నారు. తొలి ‘ఎక్స్’ జెండర్ పాస్‌పోర్టును డానా జిమ్‌కే జారీ చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook