/telugu/photo-gallery/rain-alert-expected-in-these-4-key-districts-of-telugu-states-imd-weather-alert-issued-rn-180901 AP: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ముఖ్యంగా ఆ 4 జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం.. ఐఎండి హెచ్చరిక AP: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ముఖ్యంగా ఆ 4 జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం.. ఐఎండి హెచ్చరిక 180901

కరోనా వైరస్ ( Corona virus ) పుట్టిన ప్రాంతంలో ఇప్పుడు మరో భయం పట్టుకుంది. ఆ నగరంలో పిల్లులకు కూడా కరోనా వైరస్ ( Corona virus to cats ) సోకినట్టు తేలడంతో ప్రజలు మరోసారి భయభ్రాంతులకు లోనవుతున్నారు.

ప్రపంచవ్యాప్తంగా ప్రజల్ని గజగజ వణికిస్తున్న ప్రాణాంతక కరోనా వైరస్ ఇప్పుడు మరో భయాన్ని రేపుతోంది. ఇది కూడా కోవిడ్ 19 వైరస్ పుట్టిన ప్రాంతమైన వుహాన్ ( Wuhan city ) నుంచే కావడం విశేషం. కరోనా వైరస్ పెంపుడు జంతువులైన కుక్కలు, పిల్లులకు సోకుతోందన్న వార్తలు ఇటీవలి కాలంలో వెలుగు చూశాయి. అయితే మనుష్యుల నుంచి వాటికి సోకిందా లేదా వాటి నుంచి మనుష్యులకు సోకిందా  అనే వాదన ప్రారంభమైంది. దీనికి చెక్ పెట్టేందుకు వుహాన్ లోని హువాయింగ్ వ్యవసాయ యూనివర్శిటీ పరిశోధకులు అక్కడున్న పిల్లులకు కోవిడ్ పరీక్షలు ( Covid tests to pet cats ) నిర్వహించాలని నిర్ణయించారు. ఎందుకంటే వుహాన్ లో ఎక్కువగా పిల్లుల్ని పెంచుకుంటుంటారు.

మూడు విభిన్న యానిమల్ షెల్టర్ల నుంచి..మరో మూడు పెట్ హాస్పిటల్స్ నుంచి..కరోనా సోకిన ఇళ్ల నుంచి 141 పిల్లుల్న సేకరించి కోవిడ్ పరీక్షలు నిర్వహించారు. వాటిలో 14.7 శాతం పిల్లుల్లో కరోనా యాంటీబాడీస్ బయటపడగా..10.8 శాతం పిల్లుల్లో స్థిరమైన యాంటీబాడీస్ వెలుగుచూశాయి. ఎక్కువగా యాంటీబాడీస్ ఉన్న పిల్లులు మాత్రం కరోనా సోకిన రోగుల ఇళ్లలోంచి సేకరించినవి కావడం గమనార్హం. ఈ పిల్లుల్లో కరోనా తీవ్రత ఎక్కువగా ఉందని తేలింది. 

రోగుల తుంపర్ల నుంచే పెంపుడు పిల్లులకు వైరస్ ( pet cats tested corona positive ) సోకినట్టు ల్యాబ్ పరీక్షల్లో నిర్ధారణైంది. దాంతో ఇకపై పెంపుడు జంతువులతో కూడా భౌతిక దూరం పాటించాల్సిందేనని పరిశోధకులు సూచిస్తున్నారు. ఇంతకుముందు అమెరికాలో కూడా పెంపుడు పిల్లులకు కరోనా సోకినట్టు తేలింది. Also read: Lebanon Blast: మళ్లీ అగ్ని ప్రమాదం..కార్యాలయాల్నిఖాళీ చేయిస్తున్న ఆర్మీ

Section: 
English Title: 
Pet Cats in Wuhan city tested corona positive
News Source: 
Home Title: 

Corona Cats: వుహాన్ నగరంలో పిల్లులకు కరోనా వైరస్

Corona Cats: వుహాన్ నగరంలో పిల్లులకు కరోనా వైరస్
Caption: 
file photo
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
Corona Cats: వుహాన్ నగరంలో పిల్లులకు కరోనా వైరస్
Publish Later: 
No
Publish At: 
Thursday, September 10, 2020 - 22:10
Created By: 
Md. Abdul Rehaman
Updated By: 
Md. Abdul Rehaman
Published By: 
Md. Abdul Rehaman