New Coronavirus variant IHU detected in France: ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ (Covid 19) మహమ్మారి పంజా విసురుతోంది. ఇప్పటికే రెండు వేవ్‌ల రూపంలో ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన ఈ మహమ్మారి మరోసారి విరుచుకుపడుతోంది. వైరస్ రూపాంతరం చెంది 'ఒమిక్రాన్' (Omicron) రూపంలో ప్రపంచంపై దండెత్తింది. యూకే, ఫ్రాన్స్, అమెరికా, జర్మనీ, ఆస్ట్రేలియా, భారత్ సహా పలు దేశాల్లో కేసుల సంఖ్య రోజు రోజుకు విపరీతంగా పెరిగిపోతోంది.
ఓ వైపు ఒమిక్రాన్ కేసుల సంఖ్య పెరుగుతుండగానే.. మరోవైపు ఫ్రాన్స్‌లో కొత్త వేరియంట్ కలకలం రేపుతోంది. ఫ్రాన్స్ (France)లో వెలుగులోకి వచ్చిన కరోనా కొత్త వేరియంట్ రకాన్ని శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించారు.
కరోనా కొత్త వేరియంట్ (New Coronaviru Variant)ను B.1.640.2 (IHU)గా శాస్త్రవేత్తలు నిర్దారించారు. ఈ కొత్త వేరియంట్‌లో 46 కొత్త మ్యుటేషన్‌లు ఉన్నట్లు తెలుస్తోంది. అంటే.. ఒమిక్రాన్ కంటే ఎక్కువ ప్రమాదం. రెండు డోసుల టీకాలు వేసుకున్నా కూడా దీని ప్రభావం బాగానే ఉందట.
ఒమిక్రాన్ కంటే వేగంగా వ్యాప్తి చెందుదుతుందని తెలుస్తోంది. ఇప్పటికే ఫ్రాన్స్‌లో ఈ వేరియంట్ బారిన 12 మంది పడినట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ 12 కేసులు మార్సెయిల్స్ సమీపంలో వచ్చాయి. ప్రపంచ దేశాలకు IHU ముప్పు కూడా ఉందట. B.1.640.2 వేరియంట్ ఇతర దేశాలలో గుర్తించబడలేదు.
6) There are scores of new variants discovered all the time, but it does not necessarily mean they will be more dangerous. What makes a variant more well-known and dangerous is its ability to multiply because of the number of mutations it has in relation to the original virus.
— Eric Feigl-Ding (@DrEricDing) January 3, 2022
ప్రస్తుతం భారతదేశంలో (India) ఒమిక్రాన్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. పలు రాష్ట్రాల్లో కరోనా కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. ఇప్పటికే భారత్‌లో థర్డ్ వేవ్ (Third Wave) మొదలైందని పలువురు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. థర్డ్ వేవ్ నేపథ్యంలో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. ఎప్పటికప్పుడు కేసుల వివరాలు సేకరిస్తోంది.
ప్రతి ఒక్కరు మాస్క్‌లు ధరిస్తూ భౌతిక దూరం పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. మరోవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియను కూడా వేగవంతం చేసింది. ఇప్పటికే టీనేజర్లకు వ్యాక్సినేషన్ మొదలు పెట్టగా.. జనవరి 10 నుంచి హెల్త్ వర్కర్స్, దీర్ఘకాలిక రోగులకు బూస్టర్ డోస్ (Booster Dose) ఇచ్చేందుకు ప్రణాళికలు చేపట్టింది.
Also Read: Crime News: పెద్దల్ని ఒప్పించలేక.. ఒకరికి దూరంగా మరొకరు ఉండలేక.. చావుతో ఒకటైన ప్రేమజంట!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook