Kazakhstan protests: కజకిస్తాన్ లో వారం రోజులుగా సాగుతున్న ఆందోళనల్లో (Kazakhstan protests) మొత్తం 164 మంది మరణించారు. ఈ విషయాన్ని ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వశాఖ స్వయంగా వెల్లడించింది. ఆ దేశంలో ద్రవీకృత పెట్రోలియం గ్యాస్(ఎల్పీజీ) ధరల పెంపునకు వ్యతిరేకంగా నిరసనలు జరుగుతున్నాయి. ఈ మేరకు ప్రభుత్వ వార్తా ఛానల్ ఖబర్-24 తాజా గణాంకాలు వెల్లడించింది. ఈ 164 మందిలో పౌరులు మాత్రమే ఉన్నారా? లేక భద్రత సంస్థల సిబ్బంది ఉన్నారా? అనేది తెలియాల్సి ఉంది. ఆ దేశంలో అతిపెద్ద నగరం అల్మాటీలోనే ( Almaty) 103 మరణాలు చోటుచేసుకున్నాయి.
దేశంలో పరిస్థితి అదుపులోనే ఉందని అధ్యక్షుడు టొకయెవ్ (President Kassym-Jomart Tokayev) తెలిపారు. నిరసనకారులు ఆక్రమించుకున్న భవనాలపై అధికారులు తిరిగి నియంత్రణ సాధించారని అన్నారు. అల్మాటీలో ఆదివారమూ చెదురుమదురుగా కాల్పుల శబ్దం వినిపించినట్లు రష్యా టీవీ కేంద్రం మిర్-24 వెల్లడించింది. ఆ కాల్పులు.. ఆందోళనకారులను హెచ్చరించేందుకు భద్రత సిబ్బంది జరిపినవేనా అన్న విషయమై స్పష్టత లేదని పేర్కొంది. వారం క్రితం ఆందోళనకారుల ఆధీనంలోకి వెళ్లిపోయిన అల్మాటీ విమానాశ్రయం ఆదివారమూ తెరచుకోలేదు. సోమవారం నుంచి కార్యకలాపాలు మొదలు కావొచ్చని భావిస్తున్నారు. ఈ ఆందోళనల్లో సుమారు 5,800 మందిని అదుపులోకి తీసుకున్నట్లు టోకయేవ్ కార్యాలయం తెలిపింది.
Also Read: New York Fire Accident: అమెరికాలో భారీ అగ్ని ప్రమాదం.. 19 మంది మృతి, 60 మందికి గాయాలు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook