దక్షిణ కొరియా మాజీ ప్రధాని మృతి

92 సంవత్సరాల దక్షిణ కొరియా మాజీ ప్రధాని కిమ్ జోంగ్ పిల్ ఈ రోజు ఉదయం మృతి చెందారు.

Last Updated : Jun 23, 2018, 12:06 PM IST
దక్షిణ కొరియా మాజీ ప్రధాని మృతి

92 సంవత్సరాల దక్షిణ కొరియా మాజీ ప్రధాని కిమ్ జోంగ్ పిల్ ఈ రోజు ఉదయం మృతి చెందారు. 1926లో జన్మించిన కిమ్ జోంగ్ ఉల్ కొరియన్ మిలట్రీ అకాడమీ నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 1961లో అప్పటి దేశ అధ్యక్షుడు పార్క్ చుంగ్ హీ ప్రారంభించిన మిలట్రీ కూప్‌లో కిమ్ కూడా ప్రధాన పాత్ర పోషించారు. రెండు సార్లు (1971, 1998) ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన కిమ్ కొరియాని ప్రభావితం చేసిన అతి కొద్దిమంది నాయకుల్లో ఒకరు.

2004 సంవత్సరంలో కిమ్ తాను రాజకీయాల నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. కొరియన్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ప్రారంభం కావడంలో కిమ్ తనదైన పాత్ర పోషించారు. లిబర్టీ కొరియా పార్టీ మద్దతుదారుడిగా సుపరిచితుడైన కిమ్ 2001లో భారతదేశానికి కూడా వచ్చారు. ఒక బ్రిగేడియర్ జనరల్ స్థాయి నుండి ప్రధానిగా ఎదిగిన కిమ్, కొరియా స్కౌట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కూడా సేవలందించారు. 

Trending News