ఒకప్పుడు దేశానికి ఐటీ మంత్రి...ఇప్పుడు పిజ్జా డెలివరీ బాయ్..ఎవరనుకుంటున్నారా?

Afghanistan: ఒకప్పుడు దేశానికి ఐటీ మంత్రిగా పనిచేశారు. ఇప్పుడు ఇంటింటికీ తిరిగి పిజ్జాలు డెలివరీ చేస్తున్నారు. ఆయన ఎవరో తెలుసుకోవాలనుకుంటున్నారా...అయితే ఈ స్టోరీపై లుక్కేయండి.

Edited by - ZH Telugu Desk | Last Updated : Aug 25, 2021, 03:29 PM IST
ఒకప్పుడు దేశానికి ఐటీ మంత్రి...ఇప్పుడు పిజ్జా డెలివరీ బాయ్..ఎవరనుకుంటున్నారా?

Afghanistan: ఆయన ఒకప్పుడు దేశానికి ఐటీ మంత్రిగా పనిచేశారు. ఇప్పుడు ఇంటింటికీ తిరిగి పిజ్జాలు డెలివరీ చేస్తున్నారు. ఆయనెవరో కాదు అఫ్గానిస్తాన్ మాజీ ఐటీ మంత్రి సయ్యద్ అహ్మద్ షా సాఅదత్. అప్ఘాన్ ఐటీ మంత్రి సయ్యద్ అహ్మద్(Former Afghan IT Minister Syed Ahmed) ప్రస్తుతం జర్మనీ(Germany)లో ఉన్నారు. లీప్ జిగ్ సిటీలో పిజ్జా డెలివరీ బాయ్(Pizza Delivery Boy)గా పనిచేస్తున్నారు. అప్ఘాన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ(Ashraf Ghani)కి, తమకు మధ్య మనస్పర్థలు రావటంతోనే తాను పదవికి రాజీనామా చేసినట్లు అహ్మద్ షా మీడియాకు వెల్లడించారు.  

రాజీనామా చేసిన అనంతరం తాను జర్మనీ వచ్చానని..కొంత కాలం జీవనం సాఫీగానే సాగిందని ఆయన వివరించారు. అయితే తర్వాత తన వద్ద ఉన్న డబ్బు ఖర్చపోయిందని..దాంతో బతుకుదెరువు కోసం డెలివరీ బాయ్ గా ఉద్యోగం చేయాల్సి వచ్చిందని షా తెలిపారు.  తాను మంత్రి పదవిలో ఉండగా.. అఫ్ఘానిస్తాన్‌లో సెల్‌ఫోన్ నెట్‌వర్క్‌(Cellphone network)ను విస్తరించేందుకు కృషి చేసినట్లు ఆయన వెల్లడించారు.

Also Read: CIA and Talibans: తాలిబన్లతో అమెరికా సీఐఏ రహస్య సమావేశం..రహస్య ఒప్పందమా

ఒకప్పుడు దేశ భవిష్యత్తును నిర్ణయించే పదవిలో ఉన్న వ్యక్తి.. ఇప్పుడిలా పిజ్జా డెలివరీ చేయాల్సి వచ్చిందని కొందరు సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. అయితే తనకు సానుభూతి అవసరం లేదంటున్న అహ్మద్ షా.. పని ఎలాంటిదైనా సరే దాన్ని చేయడానికి సిగ్గు పడాల్సిన అవసరం లేదని ధీమాగా చెప్తున్నారు.  ఐటీ మంత్రికే ఇలాంటి పరిస్థితి వస్తే.. తాలిబన్ల(Talibans) కారణంగా దేశం విడిచి పారిపోతున్న సామాన్యుల పరిస్థితేంటని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter Facebook

Trending News