New Zealand New PM: న్యూజిలాండ్ కొత్త ప్రధానిగా జెసిండా ఆర్డెర్న్ స్థానంలో క్రిస్ హిప్‌కిన్స్ ఎన్నిక కానున్నట్లు తెలుస్తోంది. జెసిండా స్థానంలో క్రిస్ హిప్‌కిన్స్ ఒక్కరే పోటీలో ఉండటంతో ఆయనే ప్రధానిగా దాదాపు ఫిక్స్ అయింది. గతంలో కరోనా కట్టడిలో క్రిస్ హిప్‌కిన్స్ కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే. లేబర్ పార్టీకి చెందిన 64 మంది సభ్యులు ఆదివారం జరగనున్న సమావేశంలో క్రిస్ హిప్‌కిన్స్ కొత్త ప్రధానిగా ఎన్నుకునే అవకాశం ఉంది. అదే నిజమైతే ఆయన దేశ 41వ ప్రధానిగా బాధ్యతలు చేపడతారు.
రీసెంట్ గా రాజీనామా చేసిన జెసిండా ఆర్డెర్న్ 2017లో ప్రధాని పదవి చేపట్టారు. ఈ ఐదున్నరేళ్లలో న్యూజిలాండ్ ను విజయపథంలో నడిపించారు. కొవిడ్ ను సమర్థవంతంగా నిరోధించడంలో కీలకపాత్ర పోషించారు. ఈమె ప్రభుత్వంలోనే విద్యాశాఖ మంత్రి సేవలందించారు క్రిస్ హిప్‌కిన్స్. 2008లో తొలిసారి పార్లమెంట్ కు ఎన్నికైన క్రిస్.. 2020వ సంవత్సరం నవంబర్ నెలలో కొవిడ్-19 నిరోధకశాఖ మంత్రిగా పనిచేశారు. ఈ ఏడాది అక్టోబరులో కివీస్ లో సార్వత్రిక ఎన్నికలు జరుగునున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన ఎంత కాలం ప్రధాని పదవిలో కొనసాగుతారనే తెలియాల్సి ఉంది.
ఓపీనియన్ సర్వేల ప్రకారం, లేబర్ పార్టీ కంటే కన్జరేటివ్ పార్టీ ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ టైంలో లేబర్ పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకొచ్చే బాధ్యత క్రిస్ హిప్‌కిన్స్ పై ఉంది. 'మేం కలిసికట్టుగా న్యూజిలాండ్ ప్రజలకు సేవ చేస్తాం.. అద్భుతమైన పర్సన్స్ తో కలిసి పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నాను' అని హిప్‌కిన్స్ అన్నారు.
Also Read: Google Layoffs: భారీ షాకిచ్చిన గూగుల్ మాతృసంస్థ.. ఏకంగా 12 వేలమంది ఉద్యోగులు ఇంటికి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి