రష్యాలో శనివారం ఘోర ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు హెలికాప్టర్ కూలిపోవడంతో 18 మంది దుర్మరణం పాలయ్యారు. మరణించిన వారిలో ముగ్గురు హెలికాప్టర్ సిబ్బంది కాగా ..15 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ఘటన రష్యాలోని సైబీరియా ప్రాంతంలో జరిగినట్లు సమాచారం.
ప్రమాదం జరిగిందిలా...
ప్రముఖ మీడియా కథనం ప్రకారం శనివారం మధ్యాహ్నం 3:30 ( భారత కాలమానం ప్రకారం ) ఎంఐ-8 అనే హెలికాప్టర్ 'వాంకోవర్' సంస్థకు చెందిన సిబ్బందిని తీసుకుని హెలికాఫ్టర్ టేకాఫ్ అయింది. కాగా టేకాఫ్ అయిన కాసేపటికే.. భూమికి 180 ఎత్తులో ఉన్న సమయంలో ఒక్కసారిగా హెలికాప్టర్ కుప్పకూలిపోయింది.
కారణం ఇదేనా..?
వాతావరణం అనుకూలంగా ఉందని.. ఇందులో విమానయానశాఖ తప్పేమి లేదని ఈ సందర్భంగా రష్యన్ రవాణశాఖ మంత్రిత్వశాఖ వివరణ ఇచ్చింది. అయితే పక్కనే ఉన్న మరో విమానంలోని పరికరాలు తగలడంతో ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాధామికంగా నిర్థారించారు. కాగా ఈ ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు కొనసాగుతోంది.