Ivana Trump: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొదటి భార్య ఇవానా కన్నుమూత...

Ivana Trump Passes Away: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొదటి భార్య ఇవానా ట్రంప్ న్యూయార్క్‌లోని తన స్వగృహంలో గురువారం కన్నుమూశారు.

Written by - Srinivas Mittapalli | Last Updated : Jul 15, 2022, 10:41 AM IST
  • ఇవానా ట్రంప్ కన్నుమూత
  • ఇవానా ట్రంప్ డొనాల్డ్ ట్రంప్ మొదటి భార్య
  • డొనాల్డ్ ట్రంప్ ఇవానా ట్రంప్ దంపతులకు ముగ్గురు పిల్లలు
 Ivana Trump: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొదటి భార్య ఇవానా కన్నుమూత...

Ivana Trump Passes Away: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొదటి భార్య ఇవానా మేరీ ట్రంప్ (73) కన్నుమూశారు. న్యూయార్క్ నగరంలోని తన నివాసంలో ఇవానా గురువారం (జూలై 14) తుదిశ్వాస విడిచారు. ఇవానా మరణంపై డొనాల్డ్ ట్రంప్ సంతాపం వ్యక్తం చేశారు. ఇవానా అందమైన, అద్భుతమైన మహిళ అని.. స్పూర్తిదాయకమైన జీవితాన్ని గడిపారని పేర్కొన్నారు.

ఇవానా ట్రంప్‌కు తన ముగ్గురు పిల్లలే సంతోషం,గర్వమని ట్రంప్ పేర్కొన్నారు. తన పిల్లలను చూసి ఇవానా గర్వపడేదని.. తామూ ఆమె గురించి గర్వపడుతున్నామని చెప్పారు. ఇవానా ట్రంప్-డొనాల్డ్ ట్రంప్‌ దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. వారే ఇవాంకా ట్రంప్, డొనాల్డ్ జూనియర్, ఎరిక్.

చెకోస్లోవేకియా-అమెరికా సంతతికి చెందిన ఇవానా ట్రంప్ మోడల్‌గా తన కెరీర్‌ను ఆరంభించారు. ఆ తర్వాత ఫ్యాషన్ డిజైనర్‌గా, వ్యాపారవేత్తగా రచయిత్రిగా గుర్తింపు పొందారు. 1977లో డొనాల్డ్ ట్రంప్‌ను పెళ్లి చేసుకున్నారు. అదే ఏడాది వీరికి డొనాల్డ్ జూనియర్ జన్మించాడు. 1981లో ఇవాంకా, 1984లో ఎరిక్ జన్మించారు. తన తల్లి మరణానికి నివాళి అర్పించిన డొనాల్డ్ జూనియర్.. ఆమె ఒక అద్భుతమైన మహిళ అని అభివర్ణించారు. వ్యాపార రంగంలో ఆమె ఓ శక్తి అని, వరల్డ్ క్లాస్ అథ్లెట్‌ అని, పిల్లలను ప్రేమించే తల్లి అని పేర్కొన్నారు. ఆమెను తాము చాలా మిస్ అవుతామని వాపోయారు.

కాగా, అప్పట్లో నటి మార్లా మ్యాపుల్స్‌తో ట్రంప్ ఎఫైర్ ఇవానా ట్రంప్‌తో విడాకులకు కారణమైంది. 1990లో ఈ దంపతులు విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత 1993లో ట్రంప్ మార్లా మ్యాపుల్స్‌ను వివాహం చేసుకున్నారు. ఆమెతో విడాకుల తర్వాత 2005లో ట్రంప్ మెలానియాను వివాహం చేసుకున్నారు.

Also Read: Pratap Pothen: రాధిక మాజీ భర్త ప్రతాప్ పోతెన్ కన్నుమూత

Also Read: Covid Cases: దేశంలో కొవిడ్ కల్లోలం.. 20 వేలు దాటిన రోజువారి కేసులు.. వైద్యశాఖ హై అలర్ట్

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News