Janhvi Kapoor: తెలుగులో జాన్వీకి మరో బంపరాఫర్.. మరో బడా స్టార్ సరసన శ్రీదేవి తనయ..

Janhvi Kapoor: జాన్వీ కపూర్ ప్రస్తుతం సౌత్ సినీ ఇండస్ట్రీపై ఫోకస్ పెట్టింది. ఒకపుడు తన తల్లి శ్రీదేవికి పట్టం కట్టిన ఇక్కడ ప్రేక్షకులు ...తనకు కూడా పట్టం కడతారేనే ఉద్దేశ్యంతో తెలుగు సినిమాల్లో నటిస్తోంది. ఇప్పటికే ఎన్టీఆర్, రామ్ చరణ్ ల సరసన నటిస్తున్న జాన్వీ .. త్వరలో మరో బిగ్ హీరో సినిమాలో ఛాన్స్ కొట్టేసినట్టు సమాచారం.

1 /5

అతిలోకసుందరి శ్రీదేవికి మన తెలుగు హీరోలైన ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి బడా స్టార్ హీరోలు బిగ్ ఫ్యాన్స్. అందుకే జాన్వీ కపూర్ కు బ్రేక్ ఇవ్వాలనే ఉద్దేశ్యంతో తమ సినిమాల్లో హీరోయిన్ గా తీసుకున్నట్టు ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి.

2 /5

హిందీలో జాన్వీ కపూర్ యాక్ట్ చేసిన సినిమాలేవి పెద్దగా ఆడిన దాఖలాలు లేవు. అందుకే ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘దేవర’ మూవీతో సౌత్ సినీ ఇండస్ట్రీపై ఫోకస్ పెట్టింది. ఈ సినిమా అక్టోబర్ 10న విడుదల కానుంది.

3 /5

ఈ సినిమాలో నటిస్తూనే రామ్ చరణ్, బుచ్చిబాబు బిగ్ ప్రాజెక్ట్ లో హీరోయిన్ గా నటించే ఛాన్స్ కొట్టేసింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది.

4 /5

అంతేకాదు జాన్వీ కపూర్.. రాజమౌళి, మహేష్ బాబు బిగ్ ప్రాజెక్ట్ లో హీరోయిన్ గా ఫైనలైజ్ అయినట్టు సమాచారం. మహేష్ బాబు కూడా శ్రీదేవికి బిగ్ ఫ్యాన్. అటు రాజమౌళి కూడా జాన్వీ కపూర్ ను తన సినిమాలో భాగం చేయాలనే ఉద్దేశ్యంతో ఉన్నారు. త్వరలో జాన్వీ కపూర్.. ఈ ప్రాజెక్ట్ లో నటించే విషయమై అఫీషియల్ ప్రకటన వెలుబడే అవకాశం ఉంది.

5 /5

మరోవైపు జాన్వీ కపూర్.. ప్రభాస్, హను రాఘవపూడి ప్రాజెక్ట్ లో భాగం కానున్నట్టు సమాచారం. మొత్తంగా జాన్వీ కపూర్.. వరుసగా తెలుగు ప్రాజెక్ట్స్ పై నజర్ పెట్టి ప్యాన్ ఇండియా హీరోయిన్ గా సత్తా చాటాలని చూస్తోంది.