Pancha Graha Kutami: ఖగోళ శాస్త్రం ప్రకారం అంతరిక్షంలో గ్రహాలు నిర్ణీత కక్ష్యలో తిరుగుతుంటాయి. సూర్యుని చుట్టూ భూమి, భూమి చుట్టూ చంద్రుడు పరిభ్రమిస్తుంటాయి. ఇది నిరంతరం జరిగే ప్రక్రియ. అయితే జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఈ కదలికకు ఓ నిర్దిష్టమైన కారణం మనిషి జీవితంతో ముడిపడి ఉందని చెబుతారు. అందుకే గ్రహాల కదలికకు ప్రాధాన్యత ఎక్కువ.
జ్యోతిష్యం ప్రకారం అత్యంత అరుదైన గ్రహాల కూటమి లేదా గ్రహాల కలయిక జూన్ 5,6 తేదీల్లో సంభవించనుంది. జూన్ 5వ తేదీ ఉదయం 10.37 గంటలకు శుక్రుడు మకర రాశిలో ప్రవేశించనుండగా అదే రోజు మద్యాహ్నం 2.22 గంటలకు చంద్రుడు ప్రవేశించనున్నాడు. అంటే శుక్ర, చంద్ర గ్రహాలు గంటల వ్యవధిలో ఒకే రాశిలో కలవనున్నాయి. ఈ రెండు గ్రహాలు మకర రాశిలో ప్రవేశించేటప్పటికే ఆ రాశిలో కుజ, బుధ, శని గ్రహాలుండటంతో ఒకేసారి 5 గ్రహాల కలయిక లేదా పంచ గ్రహ కూటమి ఏర్పడుతోంది. ఈ పరిణామం అత్యంత అరుదైందిగా జ్యోతిష్యులు భావిస్తున్నారు. మరోవైపు కాల సర్పయోగం కూడా ఏర్పడనుంది. దాంతో పంచ గ్రహకూటమి, కాల సర్పయోగం ప్రభావం ఎలాంటి దుష్పరిణామాలకు దారితీస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. జ్యోతిష్య పండితులు సైతం జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా కొన్ని రాశులవారు అప్రమత్తంగా ఉండాలంటున్నారు.
జ్యోతిష్యశాస్త్రంలో జరగనున్న పంచ గ్రహకూటమి, కాలసర్ప యోగం కారణంగా మిధున రాశి జాతకులకు కొద్దిగా సమస్యలు తలెత్తవచ్చు. ఉద్యోగులు జాగ్రత్తగా ఉంటే ఫరవాలేదు. కానీ వ్యాపారస్థులు మాత్రం నష్టపోతారు. ముఖ్యంగా నమ్ముకున్నవారే మోసం చేస్తారు. అందుకే వ్యాపారరంగంలో ఉన్నవాళ్లు డబ్బుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబంలో కూడా సమస్యలు వచ్చే అవకాశముంది. ఉద్యోగం చేసేచోట మరింత జాగ్రత్తగా, బాధ్యతగా ఉండాలి.
కన్యా రాశి జాతకులపై కూడా పంచ గ్రహకూటమి ప్రభావం చూపించనుంది. దూర ప్రయాణాలు మానుకోవాలి. చదువు లేదా ఉద్యోగ నిమిత్తం విదేశాలకు వెళ్లాల్సిన విద్యార్ధులు జ్యోతిష్య పండితుల సూచనలు పాటించాలి. ముందుగా నవగ్రహాల్లో కుజునికి ఎర్రని పూలు సమర్పించి హనుమంతుడికి పూజలు చేస్తే మంచిదంటారు. లేకపోతే డబ్బంతా మంచినీళ్లలా ఖర్చయిపోతుంది. ఆచితూచి వ్యవహరించాల్సి న పరిస్థితి ఉంటుంది.
ఇక పంచ గ్రహకూటమి ప్రభావం కర్కాటక రాశి జాతకులపై తీవ్రంగానే పడనుంది. ఇంట్లో పెద్దవారి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. దూర ప్రయాణాలు మానుకోవడం మంచిది. మాటపై అదుపు ఉండాలి. వ్యవహారశైలి బాగుండేట్టు చూసుకోవాలి. లేకపోతే అటు కుటుంబంలో ఇటు ఉద్యోగం చేసేచోట సమస్యలు ఉత్పన్నం కావచ్చు. డబ్బుల విషయంలో పొదుపు పాటించాలి. ఆర్ధిక ఇబ్బందులు రావచ్చు.
Also read: Millionaire Formula: కోటీశ్వరులు కావాలంటే ఈ SIP ఫార్ములా ఫాలో కావల్సిందే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook