Telangana Exit Polls: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తెలంగాణలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని స్థానాలు గెలుస్తాయో అనేది తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అందరూ అంచనాలు తలకిందులు చేయగా.. మరి లోక్‌సభ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయనేది ఆసక్తి నెలకొంది. దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా నిలిచిన హైదరాబాద్ మొదలుకుని మల్కాజిగిరి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, కరీంనగర్, సికింద్రాబాద్ వంటి లోక్‌సభ స్థానాల ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ ఉంది.
Also Read: Telangana Exit Poll Results 2024 Live: తెలంగాణలో గెలుపు ఎవరిది..? ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఇలా..
అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే లోక్‌సభ ఎన్నికల్లో పునరావృతమవుతాయని దాదాపు అన్నీ సర్వేలు తేల్చాయి. 17 లోక్‌సభ నియోజకవర్గాల్లో అత్యధికంగా అధికార కాంగ్రెస్ పార్టీ సొంతం చేసుకుంటుందని ఎగ్జిట్ పోల్స్ తేల్చి చెప్పాయి. అనంతరం ఊహించినట్టుగానే బీజేపీ రెండో స్థానంలో ఉంటుందని.. ప్రతిపక్ష బీఆర్‌ఎస్ పార్టీకి ఒకటి రెండు స్థానాలు దక్కుతాయని ఎగ్జిట్ పోల్స్‌లలో ఆయా సంస్థలు తెలిపాయి.
Also Read: Group 1 Hall Tickets: టీఎస్‌పీఎస్సీ గ్రూప్ 1 హాల్ టికెట్లు విడుదల.. డౌన్‌లోడ్ చేసుకోవడం ఇలా..
ఆరా మస్తాన్
బీఆర్‌ఎస్ పార్టీ కాంగ్రెస్ బీజేపీ ఏఐఎంఐఎం
0 7-8 స్థానాలు 8-9 స్థానాలు 1
రిపబ్లిక్ టీవీ
బీఆర్‌ఎస్ పార్టీ కాంగ్రెస్ బీజేపీ ఏఐఎంఐఎం
0-1 9-10 స్థానాలు 5-6 స్థానాలు 1
పీపుల్స్ పల్స్
బీఆర్‌ఎస్ పార్టీ కాంగ్రెస్ బీజేపీ ఏఐఎంఐఎం
0-1 7-8 స్థానాలు 8-9 స్థానాలు 1
ఏబీపీ- సీ ఓటర్
బీఆర్‌ఎస్ పార్టీ కాంగ్రెస్ బీజేపీ ఏఐఎంఐఎం
0 7-9 స్థానాలు 7-9 స్థానాలు 1
జన్ కీ బాత్
బీఆర్‌ఎస్ పార్టీ కాంగ్రెస్ బీజేపీ ఏఐఎంఐఎం
0-1 4-7 స్థానాలు 9-12 స్థానాలు 1
న్యూస్ 18
బీఆర్‌ఎస్ పార్టీ కాంగ్రెస్ బీజేపీ ఏఐఎంఐఎం
5-8 2-5 స్థానాలు 7-10 స్థానాలు 0-1
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter
Telangana Lok Sabha: తెలంగాణలో అనూహ్య ఫలితాలు.. కాంగ్రెస్‌కు బీజేపీ షాక్.. కారు షెడ్డుకే?