Air India flights resumes to Dubai: న్యూఢిల్లీ: భారత్ నుంచి దుబాయ్ ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమాన సర్వీసులు యథావిధిగా కొనసాగనున్నాయి. కరోనా (Coronavirus) పాజిటివ్ సర్టిఫికెట్లు ఉన్న పేషెంట్లను తమ దేశానికి తీసుకువచ్చినందుకు గాను దుబాయ్ (Dubai) ప్రభుత్వం.. భారత ప్రభుత్వ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ (Air India Express ) విమానాలపై 15రోజులపాటు అక్టోబరు 2వరకు తాత్కాలికంగా నిషేధం విధించినట్లు పలు వార్తా కథనాలు వెలువడ్డాయి. ఈ క్రమంలో ఎయిర్ ఇండియా.. మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ ద్వారా వివరణ ఇచ్చింది. దుబాయ్‌కు శనివారం నుంచి షెడ్యూల్ ప్రకారం ఎయిర్ ఇండియా విమాన సర్వీసులు నడుస్తాయని.. ప్రయాణికులు గమనించాలంటూ ట్విట్ చేసింది. Also read: IPL 2020: RCB కొత్త జెర్సీ, థీమ్ సాంగ్ రిలీజ్
Attention Passengers from/to Dubai!
All Air India Express flights from/to Dubai will operate as per original schedule w.e.f tomorrow, September 19,2020.@HardeepSPuri @MoCA_GoI @cgidubai pic.twitter.com/mFrvJHzv1w
— Air India Express (@FlyWithIX) September 18, 2020
యూఏఈ ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. భారత్ నుంచి వెళ్లే ప్రయాణికులందరూ.. 96 గంటల ముందే ఆర్టీపీసీఆర్ (RTPCR) పరీక్ష చేయించుకోవాలి. ఆ పరీక్షలో నెగిటివ్‌గా నిర్థారణ అయినట్లు ఒరిజినల్ సర్టిఫికెట్ ఉంటేనే దుబాయ్‌లో ప్రవేశానికి అనుమతి ఉంటుంది. అయితే.. ఆగస్టు 28, సెప్టెంబర్ 4వ తేదీల్లో కోవిడ్-పాజిటివ్ సర్టిఫికెట్తో ఇద్దరు ప్రయాణికులను తీసుకువచ్చినందుకు గాను దుబాయ్ సివిల్ ఏవియేషన్ అథారిటీ (DCAA) ఈ నెల 18 నుంచి అక్టోబరు 2వరకు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమాన సర్వీసులపై తాత్కాలికంగా నిషేధం విధించిందని వార్తలు వెలువడ్డాయి. కానీ అది నిజం కాదని.. 24 గంటలపాటద తమ విమానాలను డీసీఏఏ నిలిపివేసినట్లు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ తెలిపింది. షెడ్యూల్ ప్రకారం 19వ తేదీ నుంచి విమాన సర్వీసులు నడుస్తాయని వెల్లడించింది. Also read: MI vs CSK: ఐపీఎల్ 2020 తొలి మ్యాచ్.. మినీ ఫైనల్!