8 dead and several injured after stampede in a musical festival: అమెరికాలో(America) తీవ్ర విషాదం చోటు చేసుకుంది.ఆస్ట్రోవరల్డ్ మ్యూజిక్ ఫెస్టివల్‌లో(Astroworld Music Festival) జరిగిన తొక్కిసలాటలో 8 మంది మృతి చెందారు. మరో 11 మందికి గుండెపోటు రాగా.. ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. టెక్సాస్ రాష్ట్రంలోని హోస్టన్(Houston) నగరంలో శుక్రవారం(నవంబర్ 5) రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఈవెంట్‌కు దాదాపు
50వేల మంది హాజరవడంతో ఆ ప్రాంగణమంతా కిక్కిరిసిపోయింది.
రాత్రి 9గం.-9.15గం. సమయంలో... వేదికపై ప్రముఖ ర్యాపర్ ట్రేవిస్ స్కాట్(Travis Scott) ప్రదర్శన జరుగుతున్న సమయంలో జనమంతా ఒక్కసారిగా వేదిక వైపు కదిలారు.ఈ క్రమంలో చాలామంది కిందపడిపోవడంతో తొక్కిసలాట చోటు చేసుకుందని హోస్టన్(Houston) ఫైర్ చీఫ్ శామ్యూల్ పెనా స్థానిక మీడియాతో తెలిపారు.ఆ సమయంలో ఏం జరుగుతుందో తెలియక చాలామంది తీవ్ర భయాందోళనకు గురయ్యారని పేర్కొన్నారు.
Also Read: Sierra Leone: సియారా లియోన్‌లో ఘోర దుర్ఘటన..ఆయిల్ ట్యాంకర్ పేలి 91 మంది మృతి!
the problem wasn’t the lack of paramedics and security. It’s the fact that some of you ppl in this concert are complete animals and have a disregard for anyone but yourself. RIP to the 8 souls. #ASTROWORLDFest https://t.co/LK1WUEMokO
— ⚡️ (@elariaxw) November 6, 2021
గాయపడినవారితో పాటు గుండెపోటుకు గురైన మొత్తం 17 మందిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు శామ్యూల్ తెలిపారు.ఈవెంట్ జరిగిన ప్రాంతానికి సమీపంలోనే తాత్కాలిక ఆస్పత్రిని ఏర్పాటు చేశామన్నారు.తొక్కిసలాటలో స్పృహ కోల్పోయినవారికి అక్కడే చికిత్స అందించామన్నారు.దాదాపు 300 మందికి అక్కడ చికిత్స అందించినట్లు చెప్పారు.రీయూనిఫికేషన్ సెంటర్ కూడా ఏర్పాటు చేశామని... ఈవెంట్‌కు హాజరైన తమవారి ఆచూకీ తెలియనివారు అక్కడ సంప్రదించవచ్చునని చెప్పారు. ఘటనకు సంబంధించి కచ్చితమైన ఆధారాలు, కారణాలు ఇంకా ఎవరికీ తెలియదన్నారు.కాబట్టి దీనిపై ఊహాగానాలు ప్రచారం చేయవద్దని కోరారు.
ఆస్ట్రోవరల్డ్ మ్యూజిక్ ఫెస్టివల్(Astroworld Music Festival) శుక్ర,శనివారాల్లో జరగాల్సి ఉండగా... శుక్రవారం జరిగిన ప్రమాదంతో ఈవెంట్‌ను అర్ధాంతరంగా రద్దు చేశారు. ర్యాపర్ ట్రేవిస్ స్కాట్ ఈ ఘటనపై ఇంకా స్పందించలేదు.ఈ విషాద ఘటనకు సంబంధించి ప్రస్తుతం సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు వైరల్‌గా మారాయి.
Also Read: Edible Oil Price Reduced: దేశంలో భారీగా తగ్గనున్న వంటనూనె ధరలు.. లీటరుకు రూ.5 నుంచి రూ.20 తగ్గింపు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook