YS Sharmila: ఊరు గొప్ప.. పేరు దిబ్బ.. దొర గారి డ్రీమ్డ్ ప్రాజెక్ట్ కాళేశ్వరం దుస్థితి: వైఎస్ షర్మిల

YS Sharmila On Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్ట్ పేరుతో ఖజానాను సీఎం కేసీఆర్ పీల్చుతున్నారని వైఎస్ షర్మిల విమర్శించారు. లక్షన్నర కోట్లు ఖర్చు పెట్టి, తెలంగాణను అప్పుల కుప్ప చేశారంటూ ఫైర్ అయ్యారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 10, 2023, 07:21 PM IST
YS Sharmila: ఊరు గొప్ప.. పేరు దిబ్బ.. దొర గారి డ్రీమ్డ్ ప్రాజెక్ట్ కాళేశ్వరం దుస్థితి: వైఎస్ షర్మిల

YS Sharmila On Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. 'ఊరు గొప్ప..పేరు దిబ్బ లెక్కుంది.. దొర గారి డ్రీమ్డ్ ప్రాజెక్ట్ కాళేశ్వరం దుస్థితి. కష్టమొస్తే విలువ తెలుస్తదని చెప్పిన మాటలకు, కష్టకాలంలో ప్రాజెక్ట్ చూపే ప్రతిభకు పొంతనే లేదు.' అని అన్నారు. ఎగువ నుంచి వరద నీరు పోటెత్తుతున్నా.. ఎత్తిపోయాల్సిన బాహుబలి మోటార్లు దొర లెక్కనే నిద్రపోతున్నయన్నారు. వారంలో 21 టీఎంసీలు తోడాల్సిన కేసీఆర్ కీర్తి కిరీటం.. 4 టీఎంసీలకే చతికిలబడ్డదంటూ సెటైర్లు వేశారు. 

రోజుకు 3 టీఎంసీలు అని చెప్పిన ప్రాజెక్ట్ అసలు స్వరూపం అర టీఎంసీ దాటలేదని షర్మిల ఆరోపించారు. 17 మోటార్లకు పట్టుమని పది మోటార్లు కూడా నడుస్తలేవని అన్నారు. కాళేశ్వరానికి అన్ని తానై కట్టిన దొర అండ్ మెగా ఇంజినీర్ పనితనం మూన్నాళ్ల ముచ్చటేనని కామెంట్స్ చేశారు. వర్షాలు లేకున్నా కోటి ఎకరాల మాగాణికి సాగునీరు అని చెప్పి.. నార్లు పోసేందుకు చుక్క నీరు అందలేదని విమర్శించారు. 

"లక్షన్నర కోట్లు ఖర్చు పెట్టి, తెలంగాణను అప్పుల కుప్ప చేసి.. ఇదేనా దొర నువ్వు సాధించిన జలకళ..? కాళేశ్వరం తెలంగాణకు జలజాతర కాదు. రాష్ట్రం నెత్తిన గుదిబండ. కాళేశ్వరం ప్రాజెక్ట్ రాష్ట్ర సొమ్మును ఆరగించే వైట్ ఎలిఫెంట్ అయితే.. ప్రాజెక్ట్ పేరు చెప్పి ఖజానాను పీల్చిన జలగ కేసీఆర్. రూ.1.51 లక్షల కోట్లు పెట్టి లక్ష ఎకరాలను కూడా తడపలేదు. విద్యుత్ ఉత్పత్తిలో సగం కరెంట్ వాడి ఏ ప్రాజెక్టు నింపలేదు." అంటూ మండిపడ్డారు.

నికరంగా ఎకరాకు రూ.6 లక్షలు ఖర్చు పెట్టినా.. కనీసం రైతుకు లక్ష ప్రయోజనం కూడా దక్కలేదన్నారు. ఒక్క తడికైనా సాగునీరు పారాలంటే ఎకరాకు అయ్యే ఖర్చు అక్షరాల రూ.46 వేలు అని.. రైతు పండించే పంటకు వచ్చే లాభం కన్నా.. దొర కాళేశ్వరంపై పెట్టే ఖర్చే తడిసిపోపెడు అయిందని అన్నారు. రాష్ట్ర సంపదకు కాళేశ్వరం చిల్లులు పెడుతుంటే.. దొర ఖజానాలో కాసులు గలగలమంటున్నాయంటూ సెటైరికల్ కామెంట్స్ చేశారు.

Also Read: IND Vs WI 1st Test Match: రోహిత్‌శర్మకు జోడిగా యంగ్ ప్లేయర్.. వన్‌డౌన్‌లో శుభ్‌మన్ గిల్.. టీమిండియా తుది జట్టు ఇలా..! 

Also Read: Tomato Offers: రూ.20కే కిలో టమాటా.. క్షణాల్లో ఖాళీ  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News