Sanskriti Mahotsav: ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా కేంద్ర సాంస్కృతిక శాఖ నిర్వహిస్తున్న జాతీయ సంస్కృతి మహోత్సవానికి ఓరుగల్లు సిద్ధమైంది. రెండ్రోజులపాటు ఘనంగా జరగనుంది.
75 ఏళ్ల ఆజాదీకా అమృత్ మహోత్సవ కార్యక్రమం తిరిగి ప్రారంభమైంది. కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యాన తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ రాజమండ్రిలో ఈ నెల 26, 27 తేదీల్లో అత్యంత ఘనంగా జరిగింది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు చెందిన కళాకారుల ప్రదర్శనలు, స్టాల్స్ ఏర్పాటయ్యాయి. తిరిగి ఇవాళ, రేపు అంటే 29, 30 తేదీల్లో వరంగల్ లో జరగనున్నాయి.
చారిత్రక ఓరుగల్లులో జాతీయ సంస్కృతి మహోత్సవాలకై..ఏర్పాట్లు పూర్తయ్యాయి. కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరిగే ఈ వేడుకలకు గవర్నర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఇవాళ, రేపు జరిగే ఉత్సవాల్లో.. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు చెందిన కళాకారుల సాంస్కృతిక, సంప్రదాయ నృత్యాలు అలరించనున్నాయి. దేశ సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచానికి చాటేలా జాతీయ సంస్కృతి మహోత్సవానికి హనుమకొండ ముస్తాబైంది. ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో చారిత్రక నగరి వైభవాన్ని తెలియచేసేలా.. సుందరంగా వేదికలను నిర్మించారు. ఉత్సవాలకు నగర ప్రజలకు ఆహ్వానం పలుకుతూ జరిగిన శోభాయాత్ర కనులపండువగా సాగింది. వేయిస్తంభాల గుడి నుంచి...అదాలత్ వరకు నిర్వహించిన ఈ యాత్రలో..కళాకారులు బతుకమ్మ పాటలు, ఆటలు, కోలాటాలు నృత్యాలతో సందడి చేశారు.
వరంగల్‌లో ఈ మహోత్సవాల అనంతరం హైదరాబాద్‌లో మూడ్రోజులపాటు అంటే మార్చ్ 1, 2, 3 తేదీల్లో జరగనున్నాయి.
Also read: CM KCR Yadadri: యాదాద్రిని జాతికి పునరంకితం చేసిన సీఎం కేసీఆర్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook