Heavy Traffic Jam On HYD: శనివారం నుంచి విద్యాసంస్థలకు సెలవులు కావడంతో రద్దీ మరింతగా పెరగనుంది. సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రయాణికుల సౌకర్యార్థం TGSRTC ప్రత్యేకం బస్సులను నడుపుతోంది. ఇందుకుగాను ఎంజీబీఎస్, ఉప్పల్, ఎల్బీనగర్, ఆరాంఘర్, బస్టాండ్లలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.శనివారం తెలంగాణలోని జిల్లాలకు 1600, ఏపీవైపు 300 ప్రత్యేక బస్సులు నడిపేలా ప్రణాళిక వేశారు. అయితే ఈ స్పెషల్ బస్సుల్లో అదనంగా 50శాతం చార్జీలు వసూలు చేస్తున్నారని ప్రయాణికులు మండిపడుతున్నారు. పండుగ రద్దీని ఆసరాగా చేసుకొని ఎక్కువ చార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని ప్రైవేటు ట్రావెల్స్ నిర్వాహకులను సర్కార్ హెచ్చరించింది. ఎక్కువ చార్జీలు వసూలు చేసే బస్సులను సీజ్ చేయాలని అధికారులను ఆదేశించింది.
ఇక సంక్రాంతి సందర్భంగా 366 ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు పేర్కొన్నారు. చర్లపల్లి టెర్మినల్ నుంచి ఏపీలోని నర్సాపూర్, కాకినాడ, శ్రీకాకుళం తదితర ప్రాంతాలకు 59 ప్రత్యేక రైళ్లు వేశామని చెప్పారు. 11, 12 తేదీల్లో చర్లపల్లి- విశాఖపట్నం-చర్లపల్లి వరకు సాదారణ కోచ్‌లతో 16 జన సాధారణ రైళ్లు నడుస్తున్నట్టు పేర్కొన్నారు.
అన్ రిజర్వ్డ్ కోచ్‌ల్లో వెళ్లే ప్రయాణికులు కౌంటర్ల వద్ద నిరీక్షించాల్సిన అవసరం లేకుండా మొబైల్ యాప్‌లో యూటీఎస్ ద్వారా టిక్కెట్ల్ పొందడానికి అవకాశం ఉందని వెల్లడించారు.. అన్‌రిజర్వ్ కోచ్‌లతో ప్రత్యేక రైళ్లు నర్సాపూర్, కాకినాడ, విశాఖపట్నం, శ్రీకాకుళం, మచిలీపట్నం, తిరుపతి, బైరంపూర్, జైపూర్, గోరఖ్‌పూర్, కటక్, మధురై, అర్సికెరె తదితర ప్రాంతాలకు నడుస్తున్నట్టు తెలిపారు. అలాగే జోన్ నుంచి నెల్లూరు, విజయవాడ, రాజమండ్రి, వరంగల్ తదితర స్టేషన్ల మీదుగా ప్రత్యేక రైళ్లు నడుస్తున్నట్టు వివరించారు. చెన్నై, బెంగళూరు, మధురై జోన్ల నుంచి వచ్చే షాలిమార్, సంబల్పూర్, బరౌని, విశాఖపట్నం తదితర స్టేషన్లకు మరికొన్ని ప్రత్యేక రైళ్లు నడుస్తున్నాయన్నారు.
పండుగ నేపథ్యంలో విమాన చార్జీలు మూడు రెట్లు పెరిగాయి. హైదరాబాద్ నుంచి విశాఖకు శని, ఆదివారాల్లో గరిష్ఠంగా రూ.17 నుంచి రూ. 18వేల మధ్య టిక్కెట్ ధరలు ఉన్నాయి. హైదరాబాద్ నుంచి విజయవాడకు ఆదివారం టిక్కెట్ ధర రూ. 16,976లు ఉండగా రాజమండ్రికి అదే రోజు టిక్కెట్ ధర రూ. 15,086లు ఉంది. ప్రతి గంటకు టిక్కెట్ ధరలు మారుతున్నాయి.
కాగా హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి, యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్‌గేటు వద్ద సంక్రాంతి పండుగ నేపథ్యంలో వాహనాల రద్దీ నెలకొంది. టోల్‌గేటు వద్ద వాహనాలు బారులు తీరాయి. 16 గేట్లకు 10 గేట్ల ద్వారా విజయవాడ వైపు వాహనాలను పంపించారు. సాధారణ రోజుల్లో 30 నుంచి 35వేల వాహనాలు రాకపోకలు సాగిస్తుండగా శుక్రవారం పండుగ నేపథ్యంలో 8000 వాహనాలు అదనంగా రాకపోకలు సాగించినట్లు సిబ్బంది తెలిపారు.
ఇదీ చదవండి: పెళ్లి తర్వాత భారీగా పెరిగిన శోభిత ఆస్తులు.. ఎవరి ఎక్స్ పెక్ట్ చేయరు..
ఇదీ చదవండి: వెంకటేష్ భార్య నీరజా రెడ్డి గురించి ఎవరికీ తెలియని షాకింగ్ నిజాలు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.