Indiramma Illu Phase 1 Eligibility: ఇందిరమ్మ ఇల్లకు మంజూరుకు సంబంధించిన పూర్తి వివరాలను మంత్రి పి శ్రీనివాస్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఫస్ట్ ఫేజ్‌లో సొంత జాగ కలిగిన ఓనర్లకి, సెకండ్ పేజ్‌లో సొంత స్థలం లేని వారికి జాగాలు అందించే ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. అయితే మొదటి దశలో ఇందిరమ్మ ఇళ్లకు ఎవరు అర్హులు అవుతారు? ఫస్ట్ ఫేజ్‌కు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు ఇందిరమ్మ ఇళ్ల పంపిణీకి ఐదు లక్షలు మంజూరు చేస్తామని, ఇల్లు లేని వారికి స్థలాలు ఇస్తామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ ప్రక్రియ కొనసాగుతుంది. అయితే మొదటి దశ ఇందిరమ్మ ఇళ్లకు ఎవరు అర్హులు అవుతారు? ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
దివ్యాంగులు, ఒంటరి మహిళలు, వితంతువులు, ట్రాన్స్ జెండర్, శానిటేషన్ వర్కర్లకు మొదటి ప్రాధాన్యత ఇవ్వనున్నారు. గురువారం ఇందిరమ్మ ఇళ్ల ఫిర్యాదులకు సంబంధించి మంత్రి ఓ వెబ్‌సైట్‌ను కూడా ప్రారంభించారు.
అందులో ఏవైనా ఫిర్యాదులు చేసుకోవచ్చు. Inditammaindlu.telangana.gov.in గ్రామీణ ప్రాంతాల్లో ఎంపీడీవో ఈ కంప్లైంట్ కు సంబంధించి పూర్తిగా బాధ్యతలుల చూసుకుంటారు, అర్బన్ ఏరియాలో మున్సిపల్ కమిషనర్ కు ఈ బాధ్యత ఉంటుంది.
ఇక ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో పారదర్శకతతో కొనసాగుతుందని, అర్హులైన ప్రతి ఒక్కరికి అందిస్తామని మంత్రి చెప్పారు. ఇక నల్గొండ, మహబూబ్‌నగర్, కామారెడ్డి జిల్లాలో 98 శాతం ఇన్స్పెక్షన్ పూర్తి చేశారు. ములుగు, కరీంనగర్, సంగారెడ్డి, సిద్దిపేట ఇతర జిల్లాలో 96% వరకు పూర్తి చేశారు. ఇక గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 88% వరకు పూర్తయింది అని ఇన్స్పెక్షన్ అధికారులు మంత్రి గారికి తెలిపారు.
ఇక మంత్రి శ్రీనివాసరెడ్డి ఎలాంటి జాప్య జరగకుండా త్వరగా ఇందిరమ్మ ఇళ్లను లబ్దిదారులకు అందించాలని చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సమానంగా ఈ పథకంలో లబ్ది పొందుతారని ఆయన ప్రకటించారు.