Dil Raju: తప్పైపోయింది.. క్షమించండి.. తెలంగాణ ప్రజలకు దిల్ రాజు సారీ..

Dil Raju: నిర్మాత దిల్ రాజు దిగొచ్చారు. తెలంగాణ కల్చర్ పై ఆయన చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగాయి. దీంతో బీఆర్ఎస్ నేతలతో పాటు తెలంగాణ ప్రజలు సోషల్ మీడియా వేదికగా  దిల్ రాజు తీరును ఏకిపారేసారు. ఈ నేపథ్యంలో ఆయన బహిరంగంగా క్షమాపణలు చెప్పారు.

Written by - TA Kiran Kumar | Last Updated : Jan 11, 2025, 03:24 PM IST
Dil Raju: తప్పైపోయింది.. క్షమించండి..  తెలంగాణ ప్రజలకు దిల్ రాజు  సారీ..

Dil Raju: తెలంగాణ లో కల్లు ,మటన్ కే వైబ్ ఉంటుంది. సినిమాలను ఆ తర్వాతే ప్రాధాన్యత  అన్న దిల్ రాజు పై తెలంగాణ వాదులు విరుచుక పడ్డారు.  తెలంగాణ కల్చర్ ను అవమానిస్తావా అంటూ కొంత మంది బీఆర్ఎస్ నేతలు దిల్ రాజు పై విరుచుపడ్డారు. తాజాగా జరిగిన ఈ ఘటనపై వివరణ ఇచ్చారు. తన వ్యాఖ్యలను కొంత మంది వక్రీకరించారు. తాను ఆ మాటలు అనలేదన్నారు. సంక్రాంతికి వస్తున్నాం మూవీ ఈవెంట్ నిజామాబాద్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ.. నిజామాబాద్ లో పెద్దగా సినిమా ఈవెంట్స్ నిర్వహించమన్నారు. కానీ అప్పట్లో ‘ఫిదా’ సినిమా సక్సెస్ మీట్ నిర్వహించాము. తాజాగా ఇపుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా ఈవెంట్ నిర్వహించాము.

ఒక తెలంగాణ వాసిగా అందులో నిజామాబాద్ వాసిగా తనకు పుట్టిల్లు.. ఆ జిల్లా వాసిగా అక్కడ తన సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ ఈవెంట్ నిర్వహించాము. అక్కడ నేను మాట్లాడిన కొన్ని మాటలను సోషల్ మీడియాలో కావాలనే వక్రీకరించారు.  అయిన తెలంగాణ సంస్కృతిని నేనెందకు అనరాని మాటలు అంటానని వివరణ ఇచ్చుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ కల్చర్ లో భాగం అయిన మటన్, కల్లు గురించి సంభోదించానన్నారు. ఈ సందర్భంగా ఈవెంట్ చివరలో ‘గేమ్ చేంజర్’, ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలతో బిజీగా  మన తెలంగాణ కల్చర్ అయిన దావత్ ను మిస్ అవుతున్నాను. రెండు సినిమాలు విడుదలైన తర్వాత దావత్ చేసుకొంటానన్నారు. నా వ్యాఖ్యల పట్ల ఎవరైనా హర్ట్ అయి ఉంటే క్షమాపణలు చెబుతున్నాను అంటూ ఇక ఈ ఇష్యూకు ముగింపు పలికారు.

పైగా సంక్రాంతికి ఇప్పటికే రిలీజైన ‘గేమ్ చేంజర్’ మూవీకి నెగిటివ్ టాక్ ఉంది. మరోవైపు ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా మరో 3 రోజుల్లో రిలీజ్ కాబోతుంది. ఈ నేపథ్యంలో దిల్ రాజు అనవసరమైన గొడవలతో ఎక్కడ సినిమాలపై ఎఫెక్ట్ పడుతుందనే ఉద్దేశ్యంతో ముందు జాగ్రత్తగా తాను ఆ మాటలను అనకపోయినా.. బహిరంగంగా క్షమాపణలు చెప్పి.. ఈ ఇష్యూకు ఎండ్ కార్డ్ వేసారు.

ఇదీ చదవండి: Prabhas Marriage: ప్రభాస్ మ్యారేజ్ ఫిక్స్.. డార్లింగ్ చేసుకోబోయేది ఈమెనే..!

ఇదీ చదవండి: వెంకటేష్ భార్య నీరజా రెడ్డి గురించి ఎవరికీ తెలియని షాకింగ్ నిజాలు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News