Vemulawada Raja Rajeshwara Swamy Temple: ఇటీవలే సోషల్ మీడియా ఎక్స్ వేదికగా రాజన్న భక్తుల ఇక్కట్ల పోస్టులను దృష్టిలో పెట్టుకుని కలెక్టర్ సందీప్ కుమార్ ఝ అధికారులపై ప్రత్యేకమైన చర్యలు తీసుకున్నారు. కలెక్టర్ కార్యాలయం నుంచి ఆదేశాలు రావడంతో వేములవాడ రాజన్న ఆలయంలో ఉద్యోగులను బదిలీ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని నిత్యం వేల సంఖ్యలో భక్తులు దర్శించుకుంటారు. అయితే భక్తుల రద్దీ తక్కువ ఉన్న సమయంలో కూడా, భక్తులకు ఇబ్బందులు తప్పడం లేదు. వేములవాడ రాజన్న దర్శనానికి వచ్చిన భక్తులకు ఇతర ఎదురైన ఇబ్బందులు ఉద్యోగుల తీరుపై భక్తులు ఎక్స్ వేదికగా వెల్లడించారు. ప్రశాంతతను కోరుకునేందుకు స్వామివారి సన్నిధికి దర్శనానికి వచ్చిన భక్తులకు జరిగిన చేదు అనుభాలను సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడిస్తున్నారు. అయితే ఇటీవలే దీనిపై అధికారులు స్పందించడం వల్ల 18 మంది ఉద్యోగులపై బదిలీ వేటపడినట్లు తెలుస్తోంది.
@srrsdtemple EO garu may like to please take suitable remedial action to ensure pleasant experience for pilgrims. https://t.co/ggxxCRQuqY
— CDM_RajannaSircilla (@Collector_RSL) January 19, 2025
ఎక్స్ వేదికగా భక్తుల ఆవేదన!
వేములవాడ రాజన్న ఆలయంలో భక్తులు లేకపోయినా సిబ్బంది ప్రవర్తన తీరు దారుణంగా ఉందని, భక్తులు ప్రశాంత వాతావరణంలో రాజన్న దర్శించుకునేందుకు వస్తే.. అక్కడ ఉన్న సిబ్బంది మాత్రం పెద్ద పెద్దగా అరుస్తూ.. హుండీలను కొడుతూ పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ ప్రశాంతతను లేకుండా చేస్తున్నారని ఎక్స్ వేదికగా భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలను కూడా చూడకుండా అక్కడి సిబ్బంది కొట్టినట్లుగా తట్టి లాగేస్తున్నారని, అర సెకండ్ కూడా దండం పెట్టుకునే ఛాన్స్ లేకుండా సిబ్బంది వ్యవహరిస్తున్న తీరు బాధాకరంగా ఉందంటూ భక్తుడు ఎక్స్ వేదికగా పంచుకున్నారు. ఇది గుడి అనుకుంటున్నారో?.. కోతులను ఆడించే సర్కస్ అంటుకుంటున్నారో అర్థం కాలేదంటూ ఘాటుగా భక్తులు అధికారులపై విమర్శించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వేములవాడ రాజన్న ఆలయంలో దర్శనానికి వచ్చిన భక్తుల ఆవేదనను ఎక్స్ వేదికగా వెల్లడించడంతో జిల్లా అధికారులు స్పందించారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశించడంతో మూడు రోజుల క్రితం అంతర్గత బదిలీ జరిగింది. ఇందులో భాగంగా జూనియర్ అసిస్టెంట్లు 7, రికార్డర్ అసిస్టెంట్ 5, నాలుగో తరగతి ఉద్యోగులు ఆరుగురిని అంతర్గతంగా బదిలీ చేస్తూ ఈవో వినోద్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.
రాజన్న ఉద్యోగులకు కౌన్సిలింగ్..
స్వామివారిని దర్శించుకునేందుకు వస్తున్న భక్తుల పట్ల ఉద్యోగులు ప్రవర్తిస్తున్న తీరుపై రాజన్న ఆలయ ఈవో వినోద్ రెడ్డి గురువారం కౌన్సిలింగ్ నిర్వహించారు. బదిలీ అయిన ఉద్యోగులకు ఆయన కౌన్సిలింగ్ నిర్వహిస్తూ భక్తుల పట్ల మర్యాదగా నడుచుకోవాలని చెప్పారు. స్వామి వారి ప్రధాన సన్నిధిలో ప్రతి భక్తుడు ప్రశాంతంగా దర్శనం చేసుకునే విధంగా ఉద్యోగులు వ్యవహరించాలన్నారు. ప్రతి మూడు మాసాలకు ఒకసారి తప్పనిసరిగా అన్ని శాఖల్లో పని చేసే విధంగా ఇకపై బదిలీ ఉంటుందని ఈవో చెప్పారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter