ఆర్టీసీ జేఏసి సకల జనుల సభకు హై కోర్టు అనుమతి

ఆర్టీసీ జేఏసి సకల జనుల సభకు హై కోర్టు అనుమతి

Last Updated : Oct 30, 2019, 01:00 PM IST
ఆర్టీసీ జేఏసి సకల జనుల సభకు హై కోర్టు అనుమతి

హైదరాబాద్: ఆర్టీసీ కార్మిక సంఘాలు బుధవారం చేపట్టదల్చిన సకల జనుల సమర భేరి సభకు హైకోర్టు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. బుధవారం ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో సరూర్‌నగర్ గ్రౌండ్‌లో సభ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ బహిరంగ సభకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో ఆర్టీసీ జేఏసీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశాయి. మంగళవారం మధ్యాహ్నం ఆర్టీసీ జేఏసి విజ్ఞప్తిపై విచారణ చేపట్టిన హైకోర్టు.. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా, ప్రజలకు అసౌకర్యానికి గురికాకుండా చూసుకోవడంతోపాటు పలు ఇతర షరతులకో సభ నిర్వహించుకునేందుకు అనుమతి ఇచ్చింది.

Trending News