చర్చలు విఫలంపై స్పందించిన ఆర్టీసీ ఇంఛార్జ్ ఎండీ

ఆర్టీసీ జేఏసి నేతలపై ఆర్టీసీ ఇంఛార్జ్ ఎండీ విమర్శలు

Last Updated : Oct 27, 2019, 12:43 PM IST
చర్చలు విఫలంపై స్పందించిన ఆర్టీసీ ఇంఛార్జ్ ఎండీ

హైదరాబాద్: ఆర్టీసీ కార్మికులతో చర్చలు విఫలమవడంపై ఆర్టీసీ ఇంఛార్జ్‌ ఎండీ సునీల్‌శర్మ, రవాణాశాఖ కమిషనర్‌ సందీప్‌ సుల్తానియాలు స్పందించారు. కోర్టు ఆదేశాల ప్రకారమే జేఏసీ నుంచి నలుగురు ప్రతినిధులను మాత్రమే చర్చలకు ఆహ్వానించాం. అలాగే ఒక ముఖ్యమైన సమస్యపై చర్చ జరిగేటప్పుడు ఫోన్లు ఉంటే చర్చల మధ్య ఇబ్బందిగా ఉంటుందని ఫోన్లు వద్దని చెప్పామే తప్ప ఇందులో తమకు మరో ఉద్దేశం లేదని వివరించారు. 

ఆర్టీసీ సంస్థకు జేఏసితో చర్చలు జరిపే ఉద్దేశం కనిపించలేదని.. ఆర్టీసీ చరిత్రలోనే తొలిసారిగా నిర్బంధ వాతావరణంలో చర్చలు జరిపారని కార్మిక సంఘాల నేతలు చేసిన విమర్శలను కొట్టిపడేసిన ఆర్టీసీ ఇంఛార్జ్‌ ఎండీ సునీల్‌శర్మ.. ఆర్టీసీ అధికారులు చర్చలకు పిలిచిన సమయం కంటే జేఏసి నేతలు గంట ఆలస్యంగా వచ్చినప్పటికీ వారిని అనుమతించామని అన్నారు. చర్చల మధ్యలో కొన్నిసార్లు నేతలు బయటకు వెళ్ళి వచ్చినా అభ్యంతరం చెప్పలేదని తెలిపారు. సాయంత్రం చర్చలు జరుగుతుండగానే జేఏసి నేతలు మధ్యలోనే బయటకు వెళ్లిపోయారని.. వాళ్లు మళ్లీ తిరిగొస్తారని ఇంతసేపు వేచిచూసినా ఫలితం లేకపోయిందని సునీల్ శర్మ స్పష్టంచేశారు.

Trending News