Group-1 Prelims Key: గ్రూప్-1 ప్రిలిమ్స్ ప్రాథమిక కీ విడుదల.. అభ్యంతరాల స్వీకరణకు జూలై 05 వరకు గడువు..

Group-1 Key: గ్రూప్-1 ప్రిలిమ్స్ ప్రాథమిక కీను విడుదల చేసింది టీఎస్‌పీఎస్సీ. అభ్యర్థుల యెుక్క ఓఎంఆర్ షీట్లను వెబ్ సైట్ లో ఉంచింది. జూలై 01 నుంచి 05 వరకు అభ్యంతరాలు స్వీకరించనున్నట్లు కమిషన్ తెలిపింది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jun 29, 2023, 08:11 AM IST
Group-1 Prelims Key: గ్రూప్-1 ప్రిలిమ్స్ ప్రాథమిక కీ విడుదల.. అభ్యంతరాల స్వీకరణకు జూలై 05 వరకు గడువు..

TSPSC Group-1 Prelims Primary Key: తెలంగాణ  గ్రూప్-1 అభ్యర్థులకు శుభవార్త. టీఎస్‌పీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమ్స్ ప్రాథమిక కీను విడుదల చేసింది. అభ్యర్థుల యెుక్క ఓఎంఆర్ షీట్లను వెబ్ సైట్ లో పొందుపరిచింది. 2, 33,056 మంది అభ్యర్థులు ఓఎంఆర్ షీట్లును వెబ్సైట్ లో ఉంచినట్లు కమిషన్ పేర్కొంది. ఇవి జూలై 27 వరకు అందులో ఉంటాయి. ఆన్ లైన్ లో అభ్యంతరాల స్వీకరణకు జూలై 01 నుంచి 05 వరకు సమయం ఇచ్చింది. అభ్యర్థులు ఆంగ్లంలో మాత్రమే అభ్యంతరాలు తెలియజేయాలని కమిషన్ సూచించింది.

తాజాగా గ్రూప్-1 ప్రిలిమనరీ కీ రిలీజ్ చేసిన టీఎస్‌పీఎస్సీ త్వరలోనే ప్రిలిమ్స్ ఫలితాలు వెల్లడించనుంది. గ్రూప్ 1 మెయిన్స్ కు మూడు నెలల సమయం ఉండేలా కమిషన్ ఫ్లాన్ చేస్తుంది. ఈ నేపథ్యంలో అక్టోబరు లేదా నవంబరులో గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష ఉండే అవకాశం ఉంది. 

Also Read: 35 BRS Leaders To Join Congress: కాంగ్రెస్‌లో చేరనున్న 35 మంది బీఆర్ఎస్ నేతలు ?

రాష్ట్రంలో 503 గ్రూప్‌-1 ఉద్యోగాల భర్తీకి జూన్ 11న ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించారు. ఈ ఎగ్జామ్ కు మెుత్తంగా 3,80, 202 మంది దరఖాస్తు చేసుకోగా.. 2,33,248 మంది అభ్యర్థులు హాజరయ్యారు. దీని కోసం 994 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. పేపర్ లీకేజీ కరాణంగా గతేడాది అక్టోబరు 16న జిరగిన గ్రూప్-1 పరీక్ష రద్దయిన సంగతి తెలిసిందే. జూన్ 11న జరిగిన పరీక్షను గతంతో పోలిస్తే 50 వేల మంది తక్కువ రాశారు. ఇక ప్రిలిమ్స్ రద్దు చేయాలన్న పిటిషన్ పై మూడు వారాల్లో పిటిషన్ దాఖలు చేయాలని కమిషన్ ను హైకోర్టు ఆదేశించింది. 

Also Read: PM Modi Telangana tour: జులైలో తెలంగాణకు ప్రధాని మోదీ.. అదే కారణమా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

Trending News