Ktr Comments: కాంగ్రెస్, బీజేపీ సర్వేల్లో టీఆర్ఎస్ దే అధికారం! 90 సీట్ల లెక్క చెప్పిన కేటీఆర్..

Ktr Comments: తెలంగాణ రాజకీయాలన్ని కొన్ని రోజులుగా ముందస్తు ఎన్నికల చుట్టే తిరుగుతున్నాయి. 2018 తరహాలోనే కేసీఆర్ మరోసారి ముందస్తు ఎన్నికలకు వెళతారనే అంచనాతో విపక్షాలు దూకుడు పెంచాయి. కాంగ్రెస్, బీజేపీలు పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి.

Written by - Srisailam | Last Updated : Jul 15, 2022, 03:24 PM IST
  • తెలంగాణలో ముందస్తు ఎన్నికల వేడి
  • షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు- కేటీఆర్
  • టీఆర్ఎస్ కు హ్యాట్రిక్ ఖాయం- కేటీఆర్
Ktr Comments: కాంగ్రెస్, బీజేపీ సర్వేల్లో టీఆర్ఎస్ దే అధికారం! 90 సీట్ల లెక్క చెప్పిన కేటీఆర్..

Ktr Comments: తెలంగాణ రాజకీయాలన్ని కొన్ని రోజులుగా ముందస్తు ఎన్నికల చుట్టే తిరుగుతున్నాయి. 2018 తరహాలోనే కేసీఆర్ మరోసారి ముందస్తు ఎన్నికలకు వెళతారనే అంచనాతో విపక్షాలు దూకుడు పెంచాయి. కాంగ్రెస్, బీజేపీలు పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఆ రెండు పార్టీల జాతీయ నేతలు తెలంగాణకు క్యూ కడుతున్నారు. కాంగ్రెస్ అగ్రనేత మేనెలలో తెలంగాణలో పర్యటించారు. మళ్లీ ఆగస్టు2న సిరిసిల్లలో బహిరంగ సభలో పాల్గొనబోతున్నారు. ఇక బీజేపీ ఏకంగా జాతీయ కార్యవర్గ సమావేశాలను హైదరాబాద్ లో నిర్వహించింది. విపక్షాలు ఆపరేషన్ ఆకర్ష్ కు తెరతీయడంతో నేతల వలసలు జోరందుకున్నాయి. సీఎం కేసీఆర్ కూడా పీకే టీమ్ తో సర్వేలు చేయిస్తుండటంతో ముందస్తు ఎన్నికలు ఖాయమనే వాతావరణం కనిపించింది. తాజాగా ముందస్తు ఎన్నికలపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణలో షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని.. ముందస్తు వచ్చే అవకాశమే లేదన్నారు మంత్రి కేటీఆర్. టీఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమన్నారు. వచ్చే ఎన్నికల్లోనూ బంపర్ మెజార్టీతో అధికారంలోకి రాబోతున్నామని చెప్పారు. కాంగ్రెస్, బీజేపీలు చేయించుకున్న సర్వేల్లోనూ టీఆర్ఎస్ గెలుస్తుందని ఫలితం వచ్చిందన్నారు కేటీఆర్. కాంగ్రెస్ సర్వేలో తమకు 40 శాతం ఓట్లు వస్తుండగా.. బీజేపీలో సర్వేలోకూ అంతే శాతం ఓటింగ్ వచ్చిందన్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లోనూ కారు పార్టీతో విజయమని విపక్షాలు కూడా ఒప్పుకుంటున్నాయని కేటీఆర్ చెప్పారు. కేసీఆర్ ఎనిమిదిన్నర ఏళ్ల పాలనపై ప్ర‌జ‌ల నుంచి మంచి స్పంద‌న వ‌చ్చింద‌న్నారు. వచ్చే ఎన్నికల్లో తమకు 90కి పైగానా సీట్లు వస్తాయని కేటీఆర్ స్పష్టం చేశారు. బలమైన నేతలను పార్టీ వదులుకోబోదని చెప్పారు. కొన్ని నియోజకవర్గాల్లో సమస్యలు ఉన్నా అన్ని సర్దుకుంటాయని.. బలమైన నేతలను కలుపుకుని పోతామని చెప్పారు.

అసెంబ్లీ రద్దుపై ఇటీవల కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపైనా కేటీఆర్ స్పందించారు. విపక్షాలు తేది ప్రకటిస్తే అసెంబ్లీని రద్దు చేస్తామని కేసీఆర్ అన్నారని.. కాని బీజేపీ నుంచి రియాక్షన్ రాలేదన్నారు. దేశంలో అన్ని వ్యవస్థలతో పాటు ఎన్నికల కమిషన్ కూడా మోడీ సర్కార్ చేతుల్లో ఉందని కేటీఆర్ ఆరోపించారు. కేసీఆర్ ఎవ‌రికీ భయపడే వ్యక్తి కాదన్నారు కేటీఆర్. ఎవరికి లొంగే రకం కాదన్నారు. వాపును చూసి కొంద‌రు బ‌లుపు అనుకుంటున్నారంటూ పరోక్షంగా బీజేపీని టార్గెట్ చేశారు. బీజేపీ డ‌బుల్ ఇంజిన్ అంటే మోడీ, ఈడీ అని కేటీఆర్ సెటైర్లు వేశారు. మంచి ప‌నుల‌తో ప్రజల మ‌న‌సులు గెల‌వ‌డం బీజేపీకి తెలియ‌దన్నారు కేటీఆర్. రాహుల్ గాంధీ సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ చచ్చుబడి పోయిందన్నారు. సిరిసిల్ల‌కు రాహుల్ గాంధీ వ‌స్తే స్వాగ‌తిస్తామన్నారు కేటీఆర్.తెలంగాణ అభివృద్దిని చూసి రాహుల్ నేర్చుకోవాలని కేటీఆర్ సూచించారు.

Read also: TRS VS BJP: పార్లమెంట్ సమావేశాల్లో బీజేపీపై యుద్దం.. రేపు టీఆర్ఎస్ ఎంపీలతో కేసీఆర్ సమావేశం

Read also:  Badrachalam Flood: 70 అడుగులకు గోదావరి నీటిమట్టం.. భద్రాచలానికి గండం! హెలికాప్టర్ పంపించిన కేసీఆర్..

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

 

 

Trending News