TG Traffic challan: నేడే లాస్ట్​ డేట్​- మీ వాహనాలపై పెండింగ్ చలాన్​లు​ చెల్లించారా..?

ట్రాఫిక్ చలాన్లపై రాయితీ గడువుకు నేడే లాస్ట్​ డేట్​ మరోసారి గడువు పెరిగే అవకాశం లేదని ప్రభుత్వం స్పష్టం వీలైనంత త్వరగా ఆఫర్​ను వినియోగించుకోవాలని సూచన

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Apr 15, 2022, 12:06 PM IST
  • ట్రాఫిక్ చలాన్లపై రాయితీ గడువుకు నేడే లాస్ట్​ డేట్​
  • మరోసారి గడువు పెరిగే అవకాశం లేదని ప్రభుత్వం స్పష్టం
  • వీలైనంత త్వరగా ఆఫర్​ను వినియోగించుకోవాలని సూచన
TG Traffic challan: నేడే లాస్ట్​ డేట్​- మీ వాహనాలపై పెండింగ్ చలాన్​లు​ చెల్లించారా..?

Today is Last for TG Traffic Challan: తెలంగాణ ప్రభుత్వం పెండింగ్‌ ట్రాఫిక్‌ చలాన్లపై ఇచ్చిన రాయితీ గడువు నేటితో (ఏప్రిల్ 15) ముగియనుంది. ఈ నేపథ్యంలో ఇంకా ఎవరైనా తమ వాహనాలపై ఉన్న పెండింగ్ ఈ-చలాన్లను వీలైనంత త్వరగా ఈ సదుపాయం వినియోగించుకుని చెల్లించాలని ట్రాఫిక్ పోలీసులు చూశారు.

నిజానికి మార్చి 31నే ఈ రాయితీ ఆఫర్ ముగియాల్సి ఉంది. అయితే చివరి రోజున ఒకేసారి పెద్ద ఎత్తున వాహనదారులు చలాన్లు కట్టేందుకు ఈ-చలాన్ పోర్టల్​ను ఓపెన్​ చేయడంతో.. సర్వర్​ సమస్య తలెత్తింది. దీనితో మరో 15 రోజులపాటు గడువు పెంచింది ప్రభుత్వం.

ఈ పెంచిన గడువు కూడా నేటితో ముగియనుంది. అయితే ఈ రాయితీ గడువును మరోసారి పెంచే యొచనలేదని కూడా స్పష్టం చేసింది ప్రభుత్వం. ఈ రాయితీ ఆఫర్ ద్వారా రూ.250  కోట్లకుపైగా పెండింగ్ చలాన్లు క్లియర్​ అయినట్లు తెలిసింది.

ఏమిటి ఈ ఆఫర్​..

వాహనాలపై పెండింగ్​లో ఉన్న చలాన్లను క్లియర్ చేసేందుకు వీలుగా.. హోం శాఖ ఈ ఏడాది కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా.. పెండింగ్​లో ఉన్న చనాన్లపై బైక్​లు, ఆటోలకు 75 శాతం, కార్లు సహా ఇతర పెద్ద వాహనాలపై 50 శాతం డిస్కౌంట్ ఇచ్చింది. ఈ ఆఫర్​ను వినియోగించుకుని చాలా మంది తమ చలాన్లను చెల్లించారు.

Also read: Rains in Telugu States: వెదర్ అలర్ట్.. మూడు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు...

Also read: Hyderabad Drug Case Update: హైదరాబాద్‌ పుడింగ్ పబ్‌ కేసులో నిందితుల కస్టడీ.. 17 వరకు విచారణ!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News