Revanth Reddy: అయిపోయిన సినిమాకు టికెట్స్ అమ్ముకున్నట్టు ఉంది కేసీఆర్ తీరు: రేవంత్ రెడ్డి

TPCC Chief Revanth Reddy fires on Telangana CM KCR. పార్లమెంట్ సమావేశాలు ఏప్రిల్ 8న ముగుస్తుంటే.. 11న ధర్నా చేస్తామని ప్రకటించిన తెలంగాణ సీఎం కేసీఆర్‌కు బుర్రలేదు అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 5, 2022, 04:27 PM IST
  • రాహుల్ గాంధీతో భేటీ కోసం ఢిల్లీ వెళ్లిన టీపీసీసీ చీఫ్
  • టీఆర్‌ఎస్, బీజేపీ పార్టీలు నాటకాలాడుతున్నాయి
  • సీఎం పెట్టిన సంతకం తెలంగాణ రైతుల పాలిట మరణ శాసనం
Revanth Reddy: అయిపోయిన సినిమాకు టికెట్స్ అమ్ముకున్నట్టు ఉంది కేసీఆర్ తీరు: రేవంత్ రెడ్డి

TPCC Chief Revanth Reddy slams Telangana CM KCR over Paddy Procurement: పార్లమెంట్ సమావేశాలు ఏప్రిల్ 8న ముగుస్తుంటే.. 11న ధర్నా చేస్తామని ప్రకటించిన తెలంగాణ సీఎం కేసీఆర్‌కు బుర్రలేదు అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. పార్లమెంట్ సమావేశాలు ముగిసిన తర్వాత ధర్నా చేస్తే.. ఎవరు పట్టించుకోరన్నారు. అయిపోయిన సినిమాకు టికెట్స్ అమ్ముకున్నట్టు ఉంది కేసీఆర్ తీరు అని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు చేయకుండా టీఆర్‌ఎస్, బీజేపీ పార్టీలు నాటకాలాడుతున్నాయని ఆయన మండిపడ్డారు.

రాహుల్ గాంధీతో భేటీ కోసం ఢిల్లీ వెళ్లిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పలు అంశాలు ప్రస్తావించారు. ఢిల్లీ తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ... 'వరి ధాన్యం కొనుగోలు అడ్డం పెట్టుకుని రాజకీయంగా పైచేయి సాధించేందుకు టీఆర్‌ఎస్, బీజేపీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. రైతులను వరి కష్టాల నుండి బయటపడేయాల్సిన భాధ్యత ప్రధాని, ముఖ్యమంత్రులపై ఉంది. వర్షా కాలంలో ధాన్యం కొనుగోలు విషయంలో ఎదురయిన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని తగిన ఏర్పాట్లు చేయకుండా.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విస్మరించాయి. 2021లో బాయిల్డ్ రైస్ ఇవ్వమని ఒప్పందంపై సీఎం పెట్టిన సంతకం తెలంగాణ రైతుల పాలిట మరణ శాసనంగా మారింది' అని అన్నారు. 

'తెలంగాణ రాష్ట్రంలో 40 లక్షల ఎకరాలలో వరి వేశారు. 80 లక్షల క్వింటాల్ల పంట పడితే 30 లక్షల బియ్యం స్థానికంగా అవసరాలు ఉంటాయి. 50 లక్షల క్వింటాళ్ల వరి ధాన్యం కొనుగోలు కోసం 10 వేల కోట్లు ఖర్చు అవుతాయి. రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని ఎఫ్సిఐకి తిరిగి ఇవ్వటం ద్వారా రాష్ట్రానికి 12 వేల కోట్లు వస్తాయి. కేసీఆర్ కుటుంబానికి రైస్ మిల్లర్లకు సంబంధాలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రైతులు దళారుల దగాకు గురవుతున్నారు. కనీస మద్దతు ధర కంటే తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు చేస్తున్న దళారులు, మిల్లర్లపై పీడీయాక్ట్, క్రిమినల్ కేసులు ఎందుకు పెట్టడం లేదు' అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. 

'ఈ నెల 6న కలెక్టరేట్ల ముట్టడి.. 7న పౌర సరఫరా కార్యాలయం ముట్టడి, విద్యుత్ సౌధ ముట్టడి చేస్తున్నాం. సీనియర్ కాంగ్రెస్ నేతలు, కాంగ్రెస్ కార్యకర్తలు ఈ ముట్టడిలో పాల్గొంటారు. నెక్లెస్ రోడ్‌లోని ఇందిరా గాంధీ విగ్రహం వద్ద 7వ తేదీన ఇందిరమ్మకు నివాళులు అర్పించి విద్యుత్ సౌద, సివిల్ సప్లై ఆఫీస్ల ముట్టడి చేస్తాం. నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్దఎత్తున పాల్గొనాలి. కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టడంతో అవే తేదీలలో టీఆర్ఎస్ కూడా ఉద్యమాలు మొదలు పెట్టింది. కాంగ్రెస్ ఉద్యమాలకు ప్రజల్లో వస్తున్న మద్దతు చూసే మమ్మల్ని అడ్డుకునేందుకు అదే సమయంలో టీఆర్ఎస్ ఉద్యమాలు మొదలుపెట్టింది. పార్లమెంట్ సమావేశాలు ఈ నెల 8న ముగుస్తుంటే.. ఈనెల 11న ధర్నా చేస్తామని ప్రకటించిన సీఎంకు బుర్రలేదు. పార్లమెంట్ సమావేశాలు ముగిసిన తర్వాత ధర్నా చేస్తే ఎవరు పట్టించుకోరు. కేసీఆర్ తీరు ఎట్లావుందంటే.. అయిపోయిన సినిమాకు టికెట్స్ అమ్ముకున్నట్టు ఉంది' అని రేవంత్ రెడ్డి విమర్శించారు. 

Also Read: RR vs RCB: ఆర్‌సీబీ అభిమానులకు బ్యాడ్ న్యూస్‌.. గ్లెన్ మాక్స్‌వెల్ ఔట్! కారణం ఇదే

Also Read: మా పిల్లలను డ్రగ్స్ టెస్టుకు తీసుకొస్తా... టెస్టులకు కేటీఆర్‌ను పంపుతావా... కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి సవాల్...

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News