Revanth Reddy Fire On Kcr:నక్సల్స్ భయంతో పారిపోయిన దొరల కోసమే ధరణి! పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..

Revanth Reddy Fire On Kcr: తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ పై మరోసారి నిప్పులు చెరిగారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. రైతులు, నిరుద్యోగుల విషయంలో తీవ్రమైన ఆరోపణలు చేశారు. తెలంగాణ రైతాంగానికి కాంగ్రెస్ వరంగల్ రైతు డిక్లరేషన్ పై మరింత స్పష్టత ఇచ్చారు.

Written by - ZH Telugu Desk | Last Updated : May 18, 2022, 02:06 PM IST
  • ధరణి పోర్టల్ పై రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు
  • నక్సల్స్ భయంతో పారిపోయిన దొరల కోసమే ధరణి
  • నిజమైన రైతులకు పట్టాలు రాలేదు- రేవంత్
 Revanth Reddy Fire On Kcr:నక్సల్స్ భయంతో పారిపోయిన దొరల కోసమే ధరణి! పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..

Revanth Reddy Fire On Kcr: తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ పై మరోసారి నిప్పులు చెరిగారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. రైతులు, నిరుద్యోగుల విషయంలో తీవ్రమైన ఆరోపణలు చేశారు. తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక ఆధ్వర్యంలో జరిగిన మీట్ ది ప్రెస్ లో మాట్లాడిన రేవంత్ రెడ్డి.. తెలంగాణ రైతాంగానికి కాంగ్రెస్ వరంగల్ రైతు డిక్లరేషన్ పై మరింత స్పష్టత ఇచ్చారు. భూమికి  తెలంగాణకు అవినాభావ సంబంధం ఉందన్నారు. మినిషిని డిఎన్ఏ ఎలాగో వ్యవసాయానికి భూమి ఒక డిఎన్ఏ వంటిదన్నారు. తెలంగాణాలో భూమికోసమే విప్లవం వచ్చిందని రేవంత్ రెడ్డి అన్నారు.  విప్లవ యోధుడు కొమరం భీమ్.. జల్ జమీన్ జంగల్ అంటూ కొట్లాడారని చెప్పారు. వ్యవసాయం పై రాష్ట్ర ప్రభుత్వందే బాధ్యత అన్నారు రేవంత్ రెడ్డి. నూతన వ్యవసాయ విధానం రాష్ట్ర ప్రభుత్వాలే రూపొందించుకోవాలన్నారు.

కేసీఆర్ ఏడేళ్ల పాలనలో తెలంగాణ అప్పులకుప్పగా మారిందన్నారు రేవంత్ రెడ్డి. 65 ఏండ్లు పాలించిన పార్టీలు 16 వేల కోట్ల అప్పులు చేస్తే.. ఒక్క కేసీఆరే ఐదు లక్షల కోట్ల అప్పు చేశారన్నారు. శ్రీలంకను రాజపక్సే కుటుంబం ఎలా దొచిందో తెలంగాణను కేసిఆర్ అలా దోచుకున్నాడని ఆరోపించారు. తెలంగాణలో 8 వేల మంది రైతులు చనిపోయారని చెప్పారు రేవంత్ రెడ్డి.  12నెలల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని.. వరంగల్ డిక్లరేషన్ లో ఇచ్చిన హామీలను అమలు చేసే బాధ్యత పీసీసీ చీఫ్ గా తనదేనని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తనకు ఎక్కువ కమీషన్లు వచ్చే పనులే కేసీఆర్ చేశారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. అవసరం లేని వాటికి ఎక్కువ అప్పులు చేశారని విమర్శించారు. రైతుల మొత్తం అప్పు 30 వేల కోట్లుగా ఉందని.. అధికారంలోకి వచ్చిన 30 రోజుల్లోనే రుణమాఫీ చేసి తీరుతామన్నారు.ప్రతి ఏటా 15 శాతం ప్రభుత్వం ఆదాయం పెరుగుతుందని రేవంత్ రెడ్డి అన్నారు.

రైతు బంధు, ధరణి పోర్టల్ పై రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. లే అవుట్లు, ప్లాట్స్ చేసిన భూములకు కూడా రైతు బంధు ఇస్తున్నారని ఆరోపించారు.  రైతు బంధు ఎవరికి ఇస్తారో,  ఎందుకు ఇస్తారో కూడా క్లారిటీ లేదన్నారు. ధరణి పోర్టల్ లో దురుద్దేశం ఉందన్నారు రేవంత్ రెడ్డి. నక్సల్ భయంతో గతంలో హైదరాబాద్ పారిపోయిన వచ్చిన దొరలకు ఉపయోగపడేలా ధరణి పోర్టల్ ఉందన్నారు. కేసీఆర్ కుట్రలతో దశాబ్దాల కిందనుంచి సాగు చేస్తున్న రైతులకు పట్టాలు రాలేదన్నారు. గతంలో హామీ ఇచ్చిన ప్రతిసారి రైతు రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకే ఉందన్నారు. రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే అన్నారు. తెలంగాణ కలను నిజం చేసిందన్నారు. ఇందిరమ్మ బరోసా పథకం నిజమైన రైతుల కోసం అయితే.. ధరణి పథకం వందల ఎకరాల భూములు ఆక్రమించుకున్న దొరల కోసం అన్నారు. కేసిఆర్ ని దించి.. ధరణి రద్దు చేస్తామని తెలిపారు రేవంత్ రెడ్డి.  

పార్టీ మారిన ఎమ్మెల్యే లపై రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. అడవికి గొర్రెలు మేపడానికి వెళ్తే.. ముసుగు దొంగలు కొన్ని దొంగతనం చేస్తారని.. కాని గొర్రెల కాపరికి గొర్రెను ఎలా కాపాడుకోవాలి అనేది తెలుసు అన్నారు. తనకు కూడా ముసుగు దొంగ నడుము విరగొట్టడం ఎలాగో నాకు తెలుసని కామెంట్ చేశారు రేవంత్ రెడ్డి.  

READ ALSO: AP Government: ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ ఎత్తివేత, జీఏడీ రిపోర్టుకు ఆదేశాలు

READ ALSO: Kane Williamson: స్వదేశానికి వెళ్లిపోయిన కేన్ మామ.. సన్‌రైజర్స్‌ కొత్త కెప్టెన్ ఎవరంటే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News