Three workers died in Adriyala Coal Mine Accident: పెద్దపల్లి జిల్లా సింగరేణి బొగ్గు గనిలో తీవ్ర విషాదం నెలకొంది. రామగుండం డివిజన్‌లోని అడ్రియాల లాంగ్వాల్ బొగ్గు గనిలో చిక్కుకున్న ముగ్గురు మృతి చెందారు. గనిలో చిక్కుకున్న ముగ్గురి మృతదేహాలను రెస్క్యూ టీం చాలా శ్రమించి వెలికితీసింది. మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో డిప్యూటీ మేనేజర్ తేజావత్ చైతన్య తేజ మృతదేహాన్ని బయటకు తీయగా.. బుధవారం ఉదయం ఏరియా సేఫ్టీ ఆఫీసర్ ఎస్ జయరాజు, కాంట్రాక్ట్ కార్మికుడు తోట శ్రీకాంత్ మృతదేహాలను వెలికితీశారు. ముగ్గురి మృతదేహాలను సింగరేణి ఏరియా ఆసుపత్రికి తరలించారు.
సోమవారం (మార్చి 7న) అడ్రియాల్ భూగర్భ గనిలో ప్రమాదవశాత్తు పైకప్పు కూలింది. ఇటీవల కూలిన పైకప్పును సరిచేస్తుండగా మరోసారి ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో గనిలో ఆరుగురు కార్మికులు చిక్కుకుపోయారు. ప్రమాదం జరిగిన రోజే ఇద్దరు సిబ్బంది సురక్షితంగా బయటపడగా.. మిగతా నలుగురి జాడ తెలియరాలేదు. రంగంలోకి దిగిన రెస్క్యూ టీం 33 గంటలు శ్రమించి.. మంగళవారం సాయంత్రం బదిలీ వర్కర్ రవీందర్‌ను కాపాడింది. శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడేందుకు ప్రయత్నిస్తుండగా.. డిప్యూటీ మేనేజర్ తేజావత్ చైతన్య విగతజీవిగా కనిపించారు. శిథిలాల కింద సేఫ్టీ మేనేజర్ ఎస్ జయరాజ్, కాంట్రాక్ట్ కార్మికుడు శ్రీకాంత్ మృతి చెందారు.
ఘటనా స్థలం నుంచి మృతదేహాలను వెలికితీసిన తర్వాత గోదావరిఖని సింగరేణి ఆసుపత్రికి తరలించారు. ప్రభుత్వ డాక్టర్లతో పోస్టుమార్టం నిర్వహించి ఆఫీసర్లు ఎస్ జయరాజు, చైతన్య తేజల మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ ఘటనతో వారి కుటుంబ సభ్యులు శోక సముద్రంలో మునిగిపోయారు. తేజకు ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. మరో రెండు నెలల్లో ఆఫీసర్ జయరాజ్ పదవీ విరమణ పొందనున్నారట.
వెంకటేష్, నరేష్, రవీందర్, వీరయ్య అనే కార్మికులు అడ్రియాల లాంగ్వాల్ బొగ్గు గని ప్రమాదంలో ప్రాణాలు దక్కించుకున్నారు. గనిలోకి మొత్తం 10 మంది వెళ్లగా నలుగురు పైకి వచ్చాక పై కప్పు కూలిందని సమాచారం తెలుస్తోంది. బొగ్గు పొరల క్రింద మృతదేహన్ని వెలికితీయడంలో తీవ్ర అడ్డంకులు ఎదురయ్యాయని అధికారులు తెలిపారు.
Also Read: Horoscope Today March 9 2022: ఈరోజు రాశి ఫలాలు.. ఆ రాశుల వారికి అధిక ధనవ్యయం తప్పదు!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook