DSC Aspirants: తెలంగాణ నిరుద్యోగులు సంచలనం.. డీఎస్సీ వాయిదాకు అర్ధరాత్రి ఉద్యమం

DSC Aspirants Protest Midnight In Hyderabad: తెలంగాణ నిరుద్యోగులు సంచలనం రేపారు. అర్ధరాత్రి నిరసన దీక్షను కొనసాగిస్తున్నారు. తమ ఉద్యమానికి తెలంగాణ ప్రభుత్వం స్పందించకపోవడంతో తెలంగాణ నిరుద్యోగులు సంచలనం రేపారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Jul 8, 2024, 11:30 PM IST
DSC Aspirants: తెలంగాణ నిరుద్యోగులు సంచలనం.. డీఎస్సీ వాయిదాకు అర్ధరాత్రి ఉద్యమం

  DSC Aspirants Protest Midnight: తమ ఉద్యమానికి తెలంగాణ ప్రభుత్వం స్పందించకపోవడంతో తెలంగాణ నిరుద్యోగులు సంచలనం రేపారు. డీఎస్సీని వాయిదా వేయాలని డిమాండ్‌ చేస్తున్నా విన్నవించుకోకుండా పరీక్షలకు షెడ్యూల్‌ విడుదల చేయడంతో నిరుద్యోగులు ఉగ్రరూపం దాల్చారు. అర్ధరాత్రి పూట కొన్ని కిలోమీటర్ల మేర పాదయాత్ర చేపడుతున్నారు. విద్యా శాఖ కార్యాలయం ముట్టడి చేపట్టిన అనంతరం దాదాపు పది గంటల పాటు సిటీ కళాశాల మైదానంలో నిర్బంధించారు. ఆహారం లేక.. తాగునీరు లేక అల్లాడారు. పోలీసులు నిర్బంధంలో కొనసాగిన వారంతా రోడ్లపైకి వచ్చారు.

Also Read: TS DSC Schedule: తెలంగాణ నిరుద్యోగులకు భారీ షాక్‌.. షెడ్యూల్‌ ప్రకారమే డీఎస్సీ పరీక్షలు

కొన్ని వారాలుగా డీఎస్సీ పరీక్షలు వాయిదా వేయాలని కోరుతున్నా రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం పట్టించుకోకుండా డీఎస్సీ పరీక్షలను యథావిధిగా నిర్వహిస్తామని ప్రకటించింది. షెడ్యూల్‌ విడుదలకు ముందు సోమవారం ఉదయం లక్డీకాపూల్‌లోని విద్యా శాఖ కార్యాలయాన్ని ముట్టడించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో డీఎస్సీ అభ్యర్థులను అదుపులోకి తీసుకుని సిటీ కాలేజ్‌ మైదానంలో ఉంచారు. అర్ధరాత్రి దాదాపు 11 గంటల వరకు నిర్బంధించారు. ఈ వార్త తెలిసి బీఆర్‌ఎస్‌ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేయడంతో డీఎస్సీ అభ్యర్థులను వదిలేశారు.

Also Read: Revanth Reddy: యువత కోసం రేవంత్‌ ప్రభుత్వం సంచలన నిర్ణయం

అయితే పోలీస్‌ నిర్బంధం నుంచి బయటపడిన డీఎస్సీ అభ్యర్థులు అర్ధరాత్రి పోరాటం చేపట్టారు. అఫ్జల్‌గంజ్‌, నాంపల్లి మీదుగా పాదయాత్ర చేస్తున్నారు. రహాస్య కార్యాచరణ పెట్టుకున్న డీఎస్సీ అభ్యర్థులు తమ లక్ష్యం దిశగా సాగుతున్నారు. కాగా అర్ధరాత్రి ఏం జరుగుతుందోనని ఆందోళన వ్యక్తమవుతోంది. డీఎస్సీ వాయిదా వేసేదాకా తమ పోరాటం చేస్తామని డీఎస్సీ అభ్యర్థులు తమ పోరాటాన్ని విరమించేది లేదని స్పష్టం చేస్తున్నారు.

వెనక్కి తగ్గని ప్రభుత్వం 
షెడ్యూల్‌ ప్రకారమే డీఎస్సీ పరీక్షలు జరుగతాయని పాఠశాల విద్యా శాఖ స్పష్టం చేసింది. ఈనెల 18వ తేదీ నుంచి ఆగస్టు 5 వరకు డీఎస్సీ పరీక్షలు ఉంటాయని వివరించింది. ఈ క్రమంలోనే ఈనెల 11వ తేదీ నుంచి వెబ్‌సైట్‌లో డీఎస్సీ హాల్ టికెట్లు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. అభ్యర్థులు హాల్‌ టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచించింది. డీఎస్సీ నిర్వహణలో భాగంగా ఇటీవల టెట్‌ ఫలితాలు విడుదల చేసిన విషయం తెలిసిందే.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

  

  

Trending News