Municipal Elections Candidate Suicide Attempt: బీ ఫారం రాలేదని అభ్యర్థి ఆత్మహత్యాయత్నం

అధిష్టానం నుంచి బీ ఫారాలు రాకపోవడంతో నిరాశచెందిన రెబల్ అభ్యర్థులు సైతం నామినేషన్లు దాఖలుచేశారు. దీంతో అధికార పార్టీ నేతల బుజ్జగింపులు మొదలుపెట్టారు.

Last Updated : Jan 14, 2020, 11:45 AM IST
Municipal Elections Candidate Suicide Attempt: బీ ఫారం రాలేదని అభ్యర్థి ఆత్మహత్యాయత్నం

తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు అధికార టీఎఆర్ఎస్‌ను ఇరకాటంలోకి నెట్టేశాయి. అధిష్టానం నుంచి బీ ఫారాలు రాకపోవడంతో నిరాశచెందిన రెబల్ అభ్యర్థులు సైతం నామినేషన్లు దాఖలుచేశారు. దీంతో అధికార పార్టీ నేతల బుజ్జగింపులు మొదలుపెట్టారు. నేడు (జనవరి 14న) మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణకు, అభ్యర్థులు బీ ఫారాలు అందజేయడానికి తుది గడువు కావడంతో టెన్షన్ మొదలైంది.

Also Read: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో భారీగా నామినేషన్లు

టీఆర్ఎస్ నుంచి బీ ఫారం దక్కకపోవడంతో ఓ అభ్యర్థి నిరాశ చెందాడు. బీ ఫారం అందజేయడానికి నేడు ఆఖరిరోజు కావడంతో ఆ అభ్యర్థి ఆత్మాహత్యాయత్నం చేశాడు. మేడ్చల్‌లో విజయ్ అనే అభ్యర్థి 14వ వార్డుకు నామినేషన్ వేశారు. టీఆర్ఎస్ బీ ఫారం దక్కేది తనకేనని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ ఎలాంటి సానుకూలత రాకపోవడంతో మేడ్చల్‌లోని అంబేడ్కర్ విగ్రహం వద్దకు చేరుకొన్న విజయ్.. కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశారు. అక్కడే ఉన్న కొందరు విజయ్‌ని అడ్డుకోవడానికి యత్నించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

నేటితో నామినేషన్ల ప్రక్రియ పూర్తి కానుంది. కాగా, 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లకు జనవరి 22వ తేదీన పోలింగ్‌ నిర్వహించనుండగా, 25న కౌంటింగ్‌ అని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నాగిరెడ్డి తెలిపారు.   జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News