తెలంగాణ ( Telangana ) ఆద్మాత్మిక కేంద్రంగా యాదాద్రిని సిద్ధం చేయడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ( CM KCR ) రూ.1200 కోట్లతో తలపెట్టిన యాదాద్రి నిర్మాణ పనులు 90 శాతం పూర్తయ్యాయి. ఆదివారం ముఖ్యమంత్రి కేసీఆర్ యాదాద్రిని సందర్శించి అక్కడి పనులు పర్యవేక్షించారు. తాజాగా తెలంగాణ మంత్రి కేటీఆర్ ( KTR ) యాదాద్రికి సంబంధించి ఒక వీడియోను షేర్ చేశారు. దీనిని నెటిజెన్లు దీనిని బాగా ఇష్టపడున్నారు.
ఈ వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేస్తున్న సమయంలో కేటీఆర్ ఇలా రాశారు. "భవ్యమైన యాదాద్రి ( Yadadri ) శ్రీ లక్ష్మీ నరసింహా స్వామివారి ఆలయ నిర్మాణ పనులు వీక్షిద్దాం. గౌరవనీయులైన సీఎం కేసీఆర్ గారు ఆయన పనులను వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తున్నారు. ఈ ఆలయం తెలంగాణ ఆధ్యాత్మిక రాజధానిగాఅవతరించనుంది".. అని ట్వీట్ చేశారు.
వీడియో చూడండి:
A sneak peek into the making of the magnificent Yadadri Sri Laxmi Narsimha Swamy temple
This is an initiative of Hon’ble CM KCR Garu & he has been personally monitoring the progress of the potential spiritual capital of Telangana 🙏#YadadriTemple
#SpiritualCapital pic.twitter.com/h8roedEvf1— KTR (@KTRTRS) September 14, 2020