Minister Ktr: రైతుల ఆదాయ వివరాలు చూపండి..కేంద్ర ప్రభుత్వంపై మంత్రి కేటీఆర్ ఫైర్..!

Minister Ktr: బీజేపీ, టీఆర్ఎస్ మధ్య వార్ కొనసాగుతోంది. ఇరు పార్టీలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వంపై మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు.

Written by - Alla Swamy | Last Updated : Jul 16, 2022, 06:25 PM IST
  • బీజేపీ, టీఆర్ఎస్ మధ్య వార్
  • ఇరు పార్టీల పరస్పర ఆరోపణలు
  • తాజాగా మంత్రి కేటీఆర్ విసుర్లు
Minister Ktr: రైతుల ఆదాయ వివరాలు చూపండి..కేంద్ర ప్రభుత్వంపై మంత్రి కేటీఆర్ ఫైర్..!

Minister Ktr: రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేశామన్న కేంద్ర ప్రభుత్వ ప్రకటనపై మంత్రి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. అది నిజమే అయితే అందుకు సంబంధించి సమగ్ర వివరాలను ప్రజల ముందు ఉంచాలని డిమాండ్ చేశారు. మోదీ అధికారంలోకి వచ్చాక దేశంలో ఎలాంటి పథకాలు అమలు అయ్యాయో చెప్పాలన్నారు. రైతుల సంక్షేమం కోసం ఏ ఏ పథకాలు అమలు చేశారో చెప్పాలని సవాల్ విసిరారు.

రైతుల ఆదాయ వివరాలను కూడా బహిర్గతం చేయాలన్నారు మంత్రి కేటీఆర్. దేశంలో ఎంతో మంది రైతుల ఆదాయం డబుల్ అయ్యిందని కేంద్ర వ్యవసాయ శాఖ తన అధికారిక ట్విట్టర్‌ అకౌంట్‌లో పోస్ట్‌ చేసింది. దీనిపై తనదైన శైలిలో ట్విట్టర్ వేదికగా మంత్రి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వ పోస్టర్‌కు నెటిజన్లు సైతం విపరీతంగా కౌంటర్లు ఇస్తున్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ పెట్టిన పోస్టర్‌లో ఉన్న రైతు ఓ మోడల్ అని విశ్లేషిస్తున్నారు. 

నిజంగానే మోదీ ప్రభుత్వం అన్నదాతల ఆదాయాన్ని రెట్టింపు చేస్తే..ఆ విషయాన్ని నిజమైన రైతుల ద్వారా చెప్పించాలంటున్నారు. ఇలా మోడల్స్‌తో చెప్పించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. పెయిడ్ ఆర్టిస్ట్‌లతో ఇలా చేయడం ఏంటని మండిపడుతున్నారు.

Also read:India vs England: రేపే భారత్‌, ఇంగ్లండ్ మధ్య ఆఖరి వన్డే..టీమిండియా తుది జట్టు ఇదే..!

Also read:Seethakka: ఎమ్మెల్యే సీతక్కకు తప్పిన పెను ప్రమాదం..వాగులో కొట్టుకుపోయిన పడవ..!

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News