8th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో అదిరిపోయే పెంపు.. ప్రకటన ఎప్పుడంటే..?

Central Govt Employees Salary Hike: ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో 8వ వేతన సంఘం ఏర్పాటుపై చర్చలు జోరుగా సాగుతున్నాయి. 7వ వేతన సంఘం ఏర్పాటు చేసి పదేళ్లు పూర్తి కావడంతో కొత్త పే కమిషన్ ఏర్పాటు చేయాలనే డిమాండ్స్ ఊపందకున్నాయి. 8వ వేతన సంఘం ఏర్పాటు చేయాలని రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు ట్వీట్ ద్వారా రిక్వెస్ట్ చేశారు.
 

1 /6

త్వరలోనే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు రెండో డీఏ పెంపు ప్రకటన రానుంది. ప్రస్తుతం డీఏ 50 శాతం ఉండగా.. నాలుగు శాతం పెంచే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.   

2 /6

ఇక 8వ వేతన సంఘం ఏర్పాటుపై కేంద్రానికి వరుసగా వినతులు వెళుతున్నాయి. నిబంధనల ప్రకారం పదేళ్ల తరువాత కొత్త పే కమిషన్ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.  

3 /6

ఈ మేరకు ఎంపీ విజయసాయి రెడ్డి 8వ వేతన సంఘంపై ట్వీట్ చేశారు. "7వ వేతన సంఘం 25 సెప్టెంబర్ 2013న ఆమోదించారు.  జస్టిస్ AK మాథుర్ ఆధ్వర్యంలో 4 ఫిబ్రవరి 2014న ఏర్పాటైంది. నేను ఆర్థిక శాఖ మంత్రిని అభ్యర్థించి 10 ఏళ్లు దాటింది. నిర్మలా సీతారామన్ గారు 8వ వేతన సంఘాన్ని ఏర్పాటు చేయడం వల్ల దాదాపు 50 లక్షల కేంద్ర ప్రభుత్వ జీతాలు అందుతాయి. ఉద్యోగులు ద్రవ్యోల్బణంతో వేగాన్ని కొనసాగించగలరు.." అని ఆయన కోరారు.  

4 /6

కొత్త కమిషన్‌పై కేంద్రం నిర్ణయం తీసుకుంటే.. కోటి 12 లక్షల మంది ఉద్యోగులు, పెన్షనర్లు లబ్ధి పొందనున్నారు.  

5 /6

8వ వేతన సంఘం అమలులోకి వస్తే.. 2025-26లో జీతం 44.44 శాతం పెరిగి కనీస వేతనం 26 వేల రూపాయలు అవుతుంది. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 3.68 శాతం పెరుగుతుంది. కొత్త పే కమిషన్ నిబంధనలు 2026 నుంచి అమలులోకి వచ్చే అవకాశం ఉంది.   

6 /6

బడ్జెట్ సమావేశాల తరువాత కొత్త పే కమిషన్ ఏర్పాటుపై మోదీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవచ్చు.