Actor Mohanbabu: సీఎం రేవంత్ కు మోహన్ బాబు స్ట్రాంగ్ కౌంటర్.. గతంలోనే ఆ పనిచేశానంటూ సంచలన వ్యాఖ్యలు..

CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల టాలీవుడ్ ఇండస్ట్రీకి పలు ఆదేశాలు జారీచేశారు. అంతేకాకుండా ఇక మీదట ఇండస్ట్రీ వాళ్లు తమ సినిమాకు టికెట్ ధరలు పెంచుకుంటామని వస్తే, కొన్ని పనులు చేయాలని సీఎం సూచించారు.

1 /5

తెలంగాణలో కొన్నిరోజులుగా డ్రగ్స్, సైబర్ క్రైమ్ వంటి  ఘటనలు ఎక్కువగా వార్తల్లో ఉంటున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి.. అధికారంలోకి వచ్చిన తర్వాత డ్రగ్స్ మాఫియాపై ఉక్కుపాదంమోపారు. ఇప్పటికే డ్రగ్స్ ఘటనలపై కఠిన చర్యలు తీసుకొవాలని ఆదేశాలు సైతం జారీచేశారు.

2 /5

మరోవైపు ఇటీవల మెగాస్టార్  చిరంజీవిసైతం.. డ్రగ్స్ ఘటనపై అవగాహన కల్పించే విధంగా వీడియో కూడా రిలీజ్ చేశారు. యువత డ్రగ్స్ మహమ్మారికి బలౌతుందని ఆవేదన వ్యక్తం చేశారు. డ్రగ్స్ ఘటనలపై పోలీసులకు సమాచారం ఇవ్వాలని అన్నారు. అంతేకాకుండా..డ్రగ్స్ లను అక్రమంగా రవాణా చేస్తున్న వారిపై పోలీసులకు ఫిర్యాదులు చేయాలన్నారు. 

3 /5

ఎవరైన డ్రగ్స్ అమ్ముతున్న, తీసుకుంటున్న కూడా సీక్రెట్ గా పోలీసులు చెప్పాలని, ఫిర్యాదు చేసే వారి వివరాలు కూడా గోప్యంగా ఉంటాయని కూడా చిరంజీవి వెల్లడించారు. అంతేకాకుండా.. దీనిపై ప్రజలంతా కూడా తమ వంతుగా బాధ్యతతో వ్యవహరించాలన్నారు.

4 /5

ఇక మరోవైపు తెలంగాణలో ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి డ్రగ్స్ ఘటనలపై టాలీవుడ్ ఇండస్ట్రీ అవగాహన కల్గించే విధంగా వీడియోలు తీయాలన్నారు. తమ సినిమాలకు రేట్లు పెంచాలని వచ్చే వారంతా.. మూవీలోని నటీ నటులతో డ్రగ్స్, సైబర్ మాఫియాలపై అవగాహన వీడియోలు తీయాలన్నారు. దీని వల్ల ప్రజల్లో భారీ ఎత్తున మంచి మెస్సెజ్ వెళ్తుందన్నారు.

5 /5

ఈ క్రమంలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు దీనిపై రియాక్ట్ అయ్యారు. గతంలోనే తాను.. ఇలాంటి  సందేశాత్మకంగా వీడియోలు తీశానని అన్నారు. అంతేకాకుండా.. తన వంతుగా ఉడతా భక్తిగా మరిన్ని వీడియోలు తీసి,సమాజానికి తన వంతుగా సందేశం ఇస్తానంటూ కూడా చెప్పుకొచ్చారు. ఈ మేరకు మోహన్ బాబు ఎక్స్ లో పోస్ట్ చేసి.. సీఎం రేవంత్, సీఎంఓ ఖాతాలకు ట్యాగ్ చేశారు.