Bhadrachalam: ఊహించని రీతిలో మృత్యువు దూసుకొచ్చింది. హోం వర్క్ చేసుకునే సమయంలో అనుకోకుండా జరిగిన సంఘటన ఓ బాలిక ప్రాణం తీసింది. రాస్తున్న పెన్ను ఆ బాలికను పొట్టన పెట్టుకోవడం దిగ్భ్రాంతి కలిగించే విషయం. అప్పటి దాకా హోం వర్క్ చేసుకుంటున్న చిన్నారి అంతలోనే ప్రాణం వదిలేయడంతో కన్నవారికి కడుపు కోత మిగిలింది. ఈ సంఘటన తెలంగాణలో చోటుచేసుకుంది.
Also Read: Neredmet Gang Rape: కూల్‌డ్రింక్‌లో గంజాయి కలిపి ఘోరం.. 12 ఏళ్ల బాలికపై 10 మంది రేప్
భద్రతా కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని సుభాష్‌నగర్‌లో నాలుగేళ్ల చిన్నారి రియాన్షిక కుటుంబంతో నివసిస్తోంది. సోమవారం సాయంత్రం ఇంట్లో మంచంపై కూర్చోని హోం వర్క్ చేస్తోంది. ఈ క్రమంలో అదుపుతప్పి మంచపై నుంచి కిందపడిపోయింది. అయితే కింద ఉన్న పెన్ను చిన్నారి రియాన్షిక చెవులోకి బలంగా దూసుకెళ్లింది. తీవ్ర గాయం, రక్తస్రావం కావడంతో బాలిక విలవిలలాడింది. వెంటనే భద్రాచలంలోనే ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. వెంటనే స్పందించిన వైద్యులు శస్త్ర చికిత్స చేసి విజయవంతంగా పెన్నును తొలగించారు. బాలికను ఆ నరకం నుంచి ఉపశమనం కలిగించారు. కానీ పెన్ను దూరడంతో తలలో తీవ్ర గాయమైంది.
Also Read: Doctors Surgery: కాలికి గాయమైతే ప్రైవేటు పార్ట్‌కు శస్త్ర చికిత్స.. వైద్యుల ఘన కార్యం
గుచ్చుకున్న పెన్నుతో తలలో అయిన గాయం తీవ్రమై బాలిక మంగళవారం మృతి చెందింది. శస్త్ర చికిత్స తర్వాత రియాన్షిక కోలుకుంటుందని భావించగా.. పెన్ను వలన మెదడుకు ఇన్‌ఫెక్షన్ కావడంతో బాలిక పరిస్థితి విషమించి మృతి చెందిందని వైద్యులు చెప్పారు. తమ ముద్దుల కుమార్తె మృతి చెందడంతో ఆ కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. మంగళవారం బాలిక అంత్యక్రియలు నిర్వహించారు.
అయితే రియాన్షిక ఇక లేదనే విషయాన్ని తల్లిదండ్రులు జీర్ణించుకోవడం లేదు. ఇంట్లో ఎప్పుడూ సందడి చేస్తుండే రియాన్షిక లేకపోవడంతో ఆ కుటుంబసభ్యులు లబోదిబోమంటున్నారు. కాగా ఈ సంఘటనతో తల్లిదండ్రులు మేల్కోవాలని పలువురు సూచిస్తున్నారు. చిన్నారులు ఉన్న ఇంట్లో పదునైన వస్తువులు దూరంగా ఉంచాలని పిల్లల నిపుణులు సూచిస్తున్నారు. చిన్నారులు ఉంటే వారిపై ఒక కన్నేసి ఉంచాలని.. వారిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలని చెబుతున్నారు. పిల్లల సంరక్షణపై నిర్లక్ష్యం వహిస్తే భారీ ప్రమాదాలు చోటుచేసుకుంటాయని హెచ్చరిస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి